పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంజ్ఞాధికారము

17


- బీజాక్షరములు. -

సీ. [1]అ ఇ ఉ ఋ ఌ ను నైదు నాదీర్ఘ వర్ణంబు
          [2]లైదు నేకారాదు లైదు నిలిపి
    వరుసగ వర్గాదివర్గపంచకమును
          యాదు లైదును షాదు లైదుఁ గూడఁ
    బదివర్గముల[3] వర్ణపఙ్త్కుల నొండొంటి
         క్రిందఁ బొందుగ నిల్ప[4] నందులోనఁ
    బ్రథమాక్షరంబులు పవనబీజంబులు
        నవలివి దహనబీజాక్షరములు

గీ. అవనిబీజంబు లగుఁ దృతీయాక్షరములు
   వరుణబీజంబు లగుఁ దరువాతిపదియు
   గగనబీజంబు లైదవకడల వెల్ల[5]
   వాని మేలును గీడును వలయుఁ దెలియ.[6] 58

మ. క్షితిబీజంబులసంపదల్[7] పొదలుఁబోషించుంబయోబీజము
     ల్సతతంబుంబ్రమదఁ బొనర్చు శిఖిబీజంబుల్మృతుంజేయుమా
     రుతబీజంబులు శోకవారిధిఁ బడంద్రోచు న్న భోబీజముల్
     పతినత్యంతదరిద్రుఁజేయు మొదలంబద్యాలి నొందించినన్.[8]


  1. క - ప -జ - ద లలో నున్నది.
  2. ద - లైదును నవలివి యైదు నిలిపి.
  3. ద-వర్గములు.
  4. ప - జ - పొందుగా నొండొంటి క్రిందఁ బోవఁగ నిల్వ. ద-నిల్చినందులోన
  5. ప - జ - ధరణి బీజంబు లగు వాని దాపువ్రాలు, వారి బీజంబు లాతరువాతిలిపులు.
  6. ప - జ - వాని ఫలములు తెలియంగ వలయు రేచ.
  7. క - ప - జ సంపదన్ .
  8. ప - జ నెపుడుం బద్యాది నొందించినన్. ద - మొదలం బద్యాది నొందించినన్ . ఈపాఠంబు సమంజసముగా లేదు. ఈ పద్యమునకుఁ దరువాత , ప - జ - ల లో :- "పరఁగఁగ అ ఆ వీలును, వరుసఁ గ చ ట తపయషలు ధ్రువంబుగఁ బదియున్, దరఁ బవనబీజములు గో, పరవాహన దహన వసుధ వన నభము లగున్." అనుపద్య మున్నది. ప - లో నీపద్యమునకుఁ బిదప "ఇది శ్రీకవిజనాశ్రయచ్ఛందంబునందు సంజ్ఞాధికారము సంపూర్ణము. ఇఁక వళ్లు” అని యున్నది. మఱియు జ - లో నీస్థలమున నక్షరఫలములఁ గూర్చిన పద్యములు కలవు .