ఈ పుట అచ్చుదిద్దబడ్డది
12
కవిజనాశ్రయము
దెగఁజంపు, [1]బుధుఁడు క్రూరం
బగుగ్రహముం గదిసి క్రూరుఁడై చనుమాడ్కిన్. 36
క. [2]మగణంబు పద్యముఖమున
సగణముతోఁ గూర్చి చెప్పఁ జనుఁ గృతి యొండెం
దగుపద్య మొండెఁ గర్తకు
యగణాంతము[3] చెప్పు శుభము లయ్యెడుకొఱకున్. 37
క. మభనయలు పద్యముఖమున
శుభ సుఖ ధన జయము లొసఁగి సొం పొనరించుం ;
బ్రభునాశము జతరస లవి
సభలం బద్యాది[4] నిడఁగఁ జన చెయ్యెడలన్. 38
క. నయలం జెప్పిన శుభ మగు,
జయలం జెప్పినను బతికి జయకీర్తు లగున్,
మయలం జెప్పిన సౌఖ్యము,
రయలం జెప్పినను బెంపు రయమున నిచ్చున్.[5] 39
క. పొగడొందఁ బద్యముఖమున
రగణము యగణమును గూడి రాగిల్లిన నీ
జగ మంతయు నేలెడువాఁ
డగుఁ గృతిపతి విభవయుక్తుఁ డగుఁ గవివరుఁడున్ . 40