ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సంజ్ఞాధికారము
11
కయుసు బుష్యమి యనెడునక్షత్రపంక్తి
కదియు మ భ జ స న య ర త గణములకును. 32
- గణరాసులు. -
క. అళి వృషభ సింహ తుల యుగ[1]
జలచర చాపాది కటక [2]సంజ్ఞక రాసుల్
లలి మ భ జ స న య ర తగణ
ముల కయ్యెను జగతిలోన మోహనరూపా. 33
- గణయోనులు. -
ఆ. హరిణ సర్ప వృషభ వాయరిపు కుంజర
మర్క టాజ చారు[3] మహిషములును
మలసి యోసులయ్యె మ భ జ స న య ర త
గణసమూహమునకు గుణగణాఢ్య. 34
- గణగుణదోషవిచారము. -
తే. [4]మొదల సంయుక్తవర్ణంబు పొందెనేని
మఱవ కారెంటికిని గ్రహమైత్రి వలయు ;
నిది విచారింప రేని కృతీశ్వరుండు
పిడుగు మొత్తినగతిఁ గూలు బిట్టబిఱ్ఱు. 35
క. మగణం బెప్పుడు శుభగణ
మగు, నెన్నం గ్రూరగణము మఱి డాసినచోఁ