ఈ పుట అచ్చుదిద్దబడ్డది
10
కవిజనాశ్రయము
- గణగోత్రములు. -
ఆ. కాశ్య[1] పాత్రికపిలకౌశిక వాసిష్ఠ
గౌతమాంగిరోజకణ్వమునుల[2]
గోత్రముల్ ప్రసిద్ధపాత్రముల్ మరణాది
నెన్నఁబడిన గణము లెనిమిదికిని.[3] 29
- గణోత్పత్తి. -
ఆ. చంద్రవహ్ని సూర్యచక్షుఁ డౌరుద్రుని
మూఁడుకన్నులందు మూఁడుగురువు
లుదయ మయ్యె; దాన[4] నొప్పారె మగణంబు,
నందు సప్తగణము లమరఁ బుట్టె. 30
క. [5]భగణము సగణము నగణము
తగణంబు మరుద్గణములు తనరంగ మను
ష్యగణంబులు జయగణములు
మగణంబును రగణ మరయ మహి రాక్షసముల్. 31
- గణనక్షత్రములు. -
తే. జ్యేష్ఠమృగశిరయుత్తర చెలఁగు స్వాతి
సరవి రేవతి పూర్వకాషాఢ కృత్తి