పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

కవిజనాశ్రయము

   చిన మ భ జ స న య ర త నా
   మనిరూపితగణము లయ్యె[1] మల్లియ రేచా ! 16

క. [2]గురువులు మూఁ డిడ మగణము,
   పరఁగంగా నాదిగురువు భగణం బయ్యెన్;
   సరి మధ్యగురువు జగణము,
   సరసగుణా యంత్యగురువు సగణం బయ్యెన్.[3] 17

క. [4]లఘువులు మూఁ డిడ నగణము,
   లఘు వాద్యం బయ్యెనేనిగ[5]లలి యగణ మగున్,
   లఘుమధ్యం బగు రగణము,
   లఘు వంత్యము[6] తగణ మయ్యె లాలితకీర్తీ ! 18


  1. డ - ర త లన, మనుచుండును నీగణాళి. ఈపద్యంబునకు ముందు వెనుకల నీక్రిందిపద్యములు బ-ప్రతిలోఁ గనుపట్టుచున్నవి.(1)ద్విత్రిచతుర్గురుభవములు, ధాత్రిని రెండేసి దక్కఁ, దక్కినగణముల్, మితేంద్రచంద్రు లనఁదగు, మాత్రాదిగణంబు మొదల మాత్ర లిడంగన్. (2) మొదట నడుమ నుదుద గురు వొదవె నేని, 'భజస' లగు నట్లు లఘువును బరఁగె నేని, 'యరత' లగు నట్లు మూఁడేసిగురువు లున్న, లఘువులున్న సు మరణంబు నగణ మగును. (శ్లో. ఆదిమధ్యావసా నేషు యరతాయాంతి లాఘవమ్, భజసా గౌరవం యాంతి మనౌతు గురులాఘవౌ'. అను దీనికిఁ బై పద్యము తెలుఁగు.)
  2. ఈపద్యమునకు ముందు చ - ట - జ - లలో, "చంద్రవహ్ని సూర్యచుక్షుఁ డౌరుద్రుని, మూఁడుకన్నులందు మూఁడుగురువు, లుదయమయ్యె దాన నొప్పారె మగణంబు, నందుసప్త గణము లలగఁబుట్టె" అను పద్య మున్నది.
  3. జ-విరచితముగ నంత్యగురువు విను సగణ మవున్ .
  4. ల - ప్రతిలో దీనికిబదులు గా , నగణంబు మూఁడులఘువులు, యగణంబున, కాది లఘువు య మతన యనిభా! రగణంబు మధ్యలఘు వగుఁ, దగణంబున కంత్య లఘువు దానవినోదీ! అనియున్నది.
  5. ద - లఘువాదినినుండె నేని.
  6. (అయ్యె నేని, ఆధ్యాహార్యము).