ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సంజ్ఞాధికారము
5
- గురులఘువివేకము. -
క. గురువులు నిడుదలు జడ్డ
క్కరముల బొట్టులపిఱుందకడ నూఁదినయ
క్కరములుఁ; బెఱయవి లఘువులు;
గురులఘువులు మూఁడుఁ గూడికొన[1] గణమయ్యెన్ . 13
క. [2]నీచిత్తంబున మెత్తు స
దాచారుల ననినఁ బిఱిఁదియవి[3] గురువు లగున్ ;
నీచిత్త మిగ్రుచుఁ[4] బ్రకటస
దాచారుల ననినఁ బిఱిఁదియవి లఘువు లగున్. 14
క. [5]తరుణతరశిశిరకర సురు
చిరరేఖాకారముగను జెలువుగ వ్రాయన్[6]
గురువు; మఱి లఘువు నిశిత
స్మరశరనిభ మైనవ్రాయి[7] మల్లియరేచా ! 15
- గణస్వరూపము. -
క. ఒనరఁగ మూఁడెడలను మొద
ల నడుమఁ దుదిఁ గదియఁగ గురులఘువులు నేతెం
- ↑ చ - ట - చేర్చికొన. జ - ద - చేసికొన.
- ↑ చ - గ - లలో లేదు.
- ↑ ప - మె త్తుచి, తాచారుల కనిన మొదలియవి.
- ↑ ద - మె నయు.
- ↑ ట - జ - లలో నీ పద్యము " నీచిత్తంబున ?" పద్యముకంటెఁ బైగా నున్నది. బ - ప్రతిలో “ గురువులు నిడుదలు " పద్యముకంటెఁ బైగా నున్నది.
- ↑ ట - రేఖాకార మగుచుఁ జెలు వలరినవ్రాల్ జ - రేఖాకార మగుచుఁ జెలు పడరినవ్రాల్.
- ↑ ద - నిభ మగును వ్రాయ.