ఈ పుట అచ్చుదిద్దబడ్డది
4
కవిజనాశ్రయము
ద్భావమునఁ జెప్పెఁ[1] గావ్యక
ళా వేదులు వొగడఁ గావ్యలక్షణము మహిన్ .9
- కావ్యవిభాగము. -
క. హృద్యానవద్యకావ్యము
గద్యము పద్య మని చెప్పఁగా ద్వివిధ మగున్ ;
గద్యం బపాదపదనిక
రద్యోతితనవరసార్థరచనలఁ జెల్లున్ . 10
క. నాలుగుపాదంబులచే[2]
నాలుగుప్రావళ్లు గూడినం[3] బద్యము, ప
ద్యాలియు నిరుదెఱఁ గై చను
నోలిని వృత్తములు జాతు లొనరం[4] గృతులన్ . 11
- పద్యవిభాగము. -
క. కమనీయ[5] వృత్తములు గణ
సమకనిబద్ధములు; శేషజాతులు మాత్రా
సమకనిబద్ధము లగు; నొ[6]
క్కమాత్ర లఘు వై ద్విమాత్రకము గురు వయ్యెన్[7]. 12