Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంజ్ఞాధికారము

3

    క్కడనుండి వచ్చు బెడఁ గడ
    రెడుకబ్బము సెప్ప నురుపరిజ్ఞాన మిలన్. 5

క. అతిశయముగఁ జెప్పినస
   త్కృతి కవుల కుదాత్తఫలముఁ గీర్తియుఁ జేయున్';
   మతి నెఱుఁగక[1] చెప్పినదు
   ష్కృతి కపుల కుదాత్తఫలముఁ గీర్తినిఁ జెఱుచున్. 6

క. అమరఁగ వేల్పులచేఁ గ
   బ్బము[2] సెప్పియ కాదె వరము వడసిరి మును బా
   ణమయూరాదులు, సత్కా
   వ్యము సెప్పినఁ బడయరానివస్తువు గలదే[3]. 7

క. [4]కమనీయసమస్తకళా
   గమములకును[5] జన్మభూమి కావ్యము, కావ్యా
   గమవిదుఁడు సర్వవిదుఁ డని
   సమయచతుష్టయమునందుఁ జదివిరి మొదలన్[6] . 8

క. [7]కావునఁ గవిత్వతత్త్వము
   భూవలయములోన సం దద్ద [8] పూజ్యం బని స


  1. జ - మతివగపున. మఱికొన్ని ప్రతులలో 'మతిపగనక'.
  2. జ - అమరంగా నొక్కొక కా, వ్యము. బ - అమరంగ విభులచేఁ ద - అమరంగా నొక్కొకక, బ్బము.
  3. బ - సత్కావ్యమునం బడయంగ రాని వస్తువు గలదే?
  4. ఈపద్యము ట - గ - లలో లేదు.
  5. ద - క్రమములకును.
  6. క - సభలన్
  7. ఈ పద్యము ప - జ - డ - లలో మాత్ర మున్నది.
  8. ప - డ - బెడ్ద.