ఈ పుట ఆమోదించబడ్డది
2
కవిజనాశ్రయము
క. [1]అనవద్యకావ్యలక్షణ
మొనరంగాఁ గవిజనాశ్రయుఁడు మల్లియ[2] రే
చనసుకవి[3] కవిజనాశ్రయ
మనుఛందముఁ దెనుఁగు బాస నరుదుగఁ జెప్పెన్. 3
ఛందఃప్రశంస
క. నెఱయంగా నీఛందము
తెఱఁ గెఱుఁగక కవిత చెప్పుధృష్టాత్ముఁడు ద
బ్బఱచీఁకు చీఁకుగుఱ్ఱము[4]
బఱపిన క్రియ నిఖిలహాస్యపదనిరతుఁ డగున్. 4
క. [5]కడుఁ గవితామహిమకుఁ దివి
రెడుకవి కిచ్చదువు[6] తెఱఁ గెఱింగినఁగా కె
- ↑ ఈపద్యమునకుఁ బూర్వమం దీక్రిందిపద్యములు రెండును బ - ప్రతిలోఁ గనుపడుచున్నవి.
(1) పరఁగిన విమలయశోభా
సురనిరతుఁడు భీమనాగ్రసుతుఁ డఖిలకళా
పరిణతుఁ డయ్యెను భూసుర
వరుఁడు ప్రపాదోదితధ్రువశ్రీయుతుఁడై.
(2) అసమానదానరవితన
యసమానోన్నతుఁఢు యాచకాభరణుఁడు ప్రా
ణసమానమిత్రుఁ డీకృతి
కి సహాయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతిన్. - ↑ ద-లో ‘మల్లియ’ కు బదులుగా నన్నిచోట్ల ‘మల్లయ’ యని యున్నది.
- ↑ జ- దాను
- ↑ జ - లం, బరచీకుగుఱ్ఱమును వడి
డ - న, బ్బుర నెక్కి గుడ్డిగుఱ్ఱము
ద - చెప్పఁదివిరెడుకవి ద, బ్బఱచీఁకటిగుఱ్ఱమునున్.
శబ్దరత్నాకరమందు. దివురు నతఁడు ద, బ్బఱచీకుచీకు గుఱ్ఱముఁ, బఱపినగతి - ↑ పోల్చి చూడుఁడు.
ఛందమ నఱియదె కవితెయ
దందు గదొళ్ తొళలినుళివకుకవియె కురుడం
ముందెకవల్వట్టెయిర
ల్కందుమణంపదమనిడలదేంగెయ్దపనో. (కర్ణాటచ్ఛందో౽౦బుధి.) - ↑ ద - కవికిన్ జదువు
బ - తివిరెడువానికిఁ జదువు