పీఠిక
34
మందు యతి చతుర్థగణాదియందె యున్నది. ఈమార్పు నన్నయభట్టునకు నెఱ్ఱాప్రెగ్గడకును మధ్యకాలములోఁ గలిగి యుండవలయును. ఈ రెండు హేతువులంబట్టి భీమన నన్నయభట్టు తరువాతివాఁడును విన్నకోట పెద్దనకుఁ బూర్వుఁడును నైనట్లు తేలుచున్నది. కళింగగంగు కాలనిర్ణయము కూడ దీనికి సరిపోవుచున్నది.”
దీనిని ఖండింపఁ దలఁచిన శ్రీశాస్త్రులుగారు రక్తాక్షి సంవత్సరాషాఢమాసభారతిసంచికలో - "మహాకవుల లక్ష్యములను బట్టియే లక్షణములు చెప్పఁబడుట లక్షణశాస్త్రసంప్రదాయ మగుటంజేసి నన్నయాక్కరలకు విలక్షణముగాఁ జతుర్థ గణాదిని యతిని నిల్పవలె నని చెప్పుచున్న కావ్యాలంకార చూడామణి చతుర్థగణాదిని యతిని ప్రయోగించి యున్న యెఱ్ఱాప్రెగడకుఁ దర్వాతిదె యని నొక్కి వక్కాణింపఁ దగియున్నది. ఇట్టి స్థితిలో లక్షణశాస్త్రసంప్రదాయవిరుద్ధముగాఁ మ||రా||శ్రీ || జయంతి రామయ్యపంతులుగారు “మఱియు . . ." అని యిట్లు వ్రాయుట మిక్కిలి వింతగ నున్నది." అని వ్రాసినారు.
లక్ష్యములను బట్టి లక్షణ మేర్పడుట శాస్త్రసంప్రదాయ మనుట నిర్వివాదాంశమే. కాని యాలక్షణమున కాధారము లయిన లక్ష్యము లేవి యై యుండు ననునది మిక్కిలి జాగరూకతతోఁ బరిశీలింపవలసిన విషయము. ఏదియో యొక్కపద్యమును బట్టి లక్షణకర్తలు లక్షణ మేర్పఱిచి యుందు