33
కవిజనాశ్రయము
జిన్న మార్పులు కొన్ని చేయం బడినవి. సంజ్ఞాధికారములో 38, 39, 72; వృత్తాధికారములో 137; జాత్యధికారములో 20.
గ్రంథకర్తృత్వమును గూర్చియు, నిర్మాణకాలమును గూర్చియుఁ గొందఱుపండితు లిటీవలఁ దమతమయభిప్రాయములను బత్రికాముఖమునఁ బ్రకటించినారు. గ్రంథకర్త భీమకవి కాఁ డని కొందఱును, గ్రంథము ప్రథమపీఠికలో నేను సూచించినంత ప్రాచీనము కా దని కొందఱును వ్రాసిరి. ఈ యభిప్రాయముల సమబుద్ధితో నేఁ బరిశీలించినాఁడను. కాని, నే నిదివఱలోఁ బడిన యభిప్రాయమును మార్చుకొనుటకు హేతువు లేవియుఁ గానరా లేదు. కాని కాలనిర్ణయవిషయములో బ్రహ్మశ్రీ వఝల చినసీతారామస్వామిశాస్త్రులుగారు చెప్పిన యొకమాటకు మాత్రము సమాధానము చెప్పవలసియున్న ది. మధ్యాక్కరలోని యతిస్థానవిషయము నెత్తుకొని పూర్వపీఠికలో నే నిట్లు నుడివితిని.
“మఱియు నీగ్రంథమున మధ్యాక్కరకుఁ బ్రతిపాదమునందు నాల్గవగణముమొదట యతి విధింపఁబడినది.[1] ఇది యాధునికమతము. నన్నయభట్టుకాలమున యతి యయిదవ గణము మొదట నుండినట్లు భారతమువలన విశద మగును. తిక్కనసోమయాజికవిత్వములో మధ్యాక్కరలు నాకుఁ గనఁబడలేదు. కాని యెఱ్ఱాప్రెగడకృత మగునారణ్యపర్వ శేష
- ↑ ఇది లక్ష్యమును బట్టి గ్రహింపఁదగు.