పీఠిక
26
ఆంధ్రకవు లీమూఁడువరుసల గణములలోను మొదటివి రెండేసి గణములు వదలి తక్కినవి గ్రహించి మొదటివరుసలో మిగిలిన రెండుగణములకు సూర్యగణము లనియు, రెండవవరుసలో మిగిలినయాఱుగణములకు నింద్ర గణములనియు, మూఁడవవరుసలో మిగిలిన పదునాలుగుగణములకుఁ జంద్రగణములనియు సంజ్ఞలుపెట్టిరి. కన్నడకవులు ప్రస్తరింపఁగావచ్చిన గణములన్నియు గ్రహించి మొదటివరుసలోని నాలుగుగణములకు బ్రహ్మగణము లనియు, రెండవవరుసలోని యెనిమిదిగణములకు విష్ణుగణము లనియు, మూఁడవవరుసలోని పదునాఱుగణములకు రుద్రగణము లనియు సంజ్ఞలు చేసిరి. సూర్యేంద్రగణములు దేశ్యజాతు లన్నిటియందును వచ్చును. చంద్రగణము లక్కరలు, షట్పదములు వీని యందుమాత్రము వచ్చును.
- వృత్తములు. -
పద్యములు, వృత్తము లనియు జాతు లనియు రెండు విధములు. అక్షరగణనిబద్ధములు వృత్తములు. మాత్రాగణ నిబద్ధములు జాతులు. సామాన్యవృత్తము లనియు నుద్ధర మాలావృత్తము లనియు వృత్తములు రెండువిధములు. ఉక్తాచ్ఛందము మొదలుకొని యుత్కృతిచ్ఛందమువఱకును గల యిరువదియాఱుఛందములలోఁ బుట్టినవి సామాన్యవృత్తములు. ఈ వృత్తములలోఁ బాదమున కొకయక్షరము మొదలు ఛందఃక్రమమున నిరువదాఱక్షరములవఱకు నుండును. పాదమున కిరువదియాఱక్షరములకంటె నధికముగా నుండునవి యుద్ధరమాలావృత్తములు. మఱియు సమవృత్తము లనియు, నర్ధసమ