పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

కవిజనాశ్రయము

న్నాఁడు. యతులసంఖ్య కాలక్రమమున వృద్ధియైనట్లు దీనివలనఁ దేలుచున్నది. కవిజనాశ్రయములోఁ జెప్పఁబడిన యతులసంఖ్య యన్నిటికంటెఁ దక్కువది, కావున, నాగ్రంథమె యన్నింటిలోఁ బ్రాచీన మైన దని యూహింపవచ్చును.

మఱియు నీగ్రంథమున మధ్యాక్కరకుఁ బ్రతిపాదమునందు నాల్గవగణముమొదట యతి విధింపఁబడినది.[1] ఇది యాధునిక మతము. నన్నయభట్టుకాలమున యతి యయిదవ గణము మొదట నుండినట్లు భారతమువలన విశద మగును. తిక్కనసోమయాజి కవిత్వములో మధ్యాక్కరలు నాకుఁ గనఁబడలేదు. కాని, యెఱ్ఱాప్రెగడకృత మగు నారణ్యపర్వ శేషమందు యతి చతుర్థగణాదియందె యున్నది. ఈమార్పు నన్నయభట్టునకు నెఱ్ఱాప్రెగ్గడకును మధ్యకాలములోఁ గలిగియుండవలయును. ఈరెండుహేతువులంబట్టి భీమన నన్నయభట్టు తరువాతి వాఁడును విన్నకోట పెద్దనకుఁ బూర్వుఁడును నైనట్లు తేలుచున్నది. కళింగగంగు కాలనిర్ణయముకూడ దీనికి సరిపోవుచున్నది.

-: భీమకవిఖ్యాతి :-

భీమకవి రాఘవపాండవీయాది గ్రంథములు మఱికొన్ని రచియించినట్లు వాడుకయే గాని యాగ్రంథము లింతవఱకు లభింపలేదు. సరివారలలో నిరంకుశముగాఁ బవర్తించుటయం

దాంగ్లేయకవులలో జాన్సక్ (Dr. Samuel Johnson) కవి కెట్టిఖ్యాతి కలదో యాంధ్రకవులలో భీమకవికట్టి ఖ్యాతిగలదు.

  1. ఇది లక్ష్యమును బట్టిగ్రహింపఁదగు.