పీఠిక
20
సింహే లగ్నవరే సమస్తజగతీరాజ్యాభిషిక్తోముదే
లోక స్యోద్వహతిస్మ పట్ట మనఘః శ్రీరాజరాజో విభుః,
ప్రస్తుతవిచారమునకు భీమనకాశ్రయుఁడైన రాజు వీరిరువురిలో నెవ్వఁడైన నొక్కటియె. కాని, కళింగగం గనుసంజ్ఞ యనంతవర్మ చోడగంగదేవునకే యన్వర్థ మగును. అతఁడు 999 శక సంవత్సరమాదిగా నించుమించు 60 సంవత్సరములు రాజ్యముచేసెను. భీమకవి యీతనిరాజ్యకాలము పూర్వభాగములో నుండె ననిన 924 వ శకాబ్దమునఁ బట్టాభిషిక్తుఁ డైన రాజ రాజు నాస్థానకవి యగు నన్నయభట్టునకు రమారమి 100 సంవత్సరముల తరువాతివాఁ డగును. - భీమకవి యనంతవర్మ రాజ్యావసానదశయం దుండె ననుకొన్నచో మఱి ముప్పది నలువది సంవత్సరముల తరువాతివాఁ డగును. కాని, శ్రీరామమూర్తిగా రనుకొన్నట్లు నన్నయభట్టుకంటెఁ బ్రాచీనుఁడు కాడు. వీరేశలింగముపంతులుగా రెంచినట్లు 14 వ శతాబ్దమువాఁడును గాఁడు. 12 వ శతాబ్దారంభమువాఁ డగును.
గ్రంథనిర్మాణకాలమును నిర్ణయించుటకుఁ గొంతవఱ కనుకూలపడు నంశములు రెండు కవిజనాశ్రయమునందే కలవు. ఈ గ్రంథమునందుఁ బదివిధములగుయతులు చెప్పఁబడినవి. కావ్యాలంకారచూడామణియందుఁ బదిరెండువళ్లు చెప్పఁబడినవి. “అనంతుఁ డిరవనాల్గు విశ్రమములు నామీఁదఁ గొందఱు కవి గ్రామణు లిరువదియు నేడును " విశ్రమములఁ జెప్పిన ట్లప్పకవి చెప్పియున్నాఁడు. అప్పకవి నలువదియొక్కయతుల వర్ణించియు