Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

కవిజనాశ్రయము

శకాబ్దము మొదలు రమారమి యఱువదిసంవత్సరములు కళింగదేశము ననంతవర్మయను నామాంతరముగల చోడకళింగ గంగదేవుఁడు పాలించినట్లు శాసనములవలనఁ దెలియుచున్నది. ఈరాజుకాలమునఁ బుట్టిన మూఁడు తామ్రశాసనములు ఇండియన్ అంటిక్వెరీ (Indian Antiguary) అనుపత్రిక 18 వ సం పుటములోఁ బ్రకటింపఁబడియున్నవి. వానిలో నీతనిపట్టాభిసేకకాల మిట్లు వివరింపఁబడినది.

శకాబ్దే నందరంధ్రగ్రహగణగణితే (999) కుంభసంస్థే దినేశే
శుచే పక్షేతృతీయాయుజి రవిజదినే రేవతీభే నృయుగ్మే
లగ్నేగఁ గాన్వవాయాంబుజవనదినకృద్విశ్వవిశ్వంభ రాయా
శ్చక్రం సంరక్షితుం సద్గుణనిధి రధిప శ్చోడగంగోభిషిక్తః.

ఈకాలమునందే రాజరాజచోడగంగనురాజు వేంగీదేశమును బాలించుచుండెను. ఈతఁడు రాజనరేంద్రుని పౌత్రుఁడు. కాంచీపురము రాజధానిగా వేంగీచోళదేశములనేకచ్ఛత్రముగా నేలిన కుళోత్తుంగచోళుని యగ్రపుత్రుఁడు. తండ్రి యాజ్ఞానుసారముగ వేంగీదేశమును బాలించెను. అతఁడు 1006వ శకాబ్దమునం దభిషిక్తుఁడైనట్లు ఎపిగ్రాఫియా ఇండికా (Epigraphia Indica) యనుపత్రిక 6వ సంపుటమునఁ బ్రకటింపఁబడిన టేకిశాసనమునం దిట్లు చెప్పఁబడియున్నది.

"శాకాబ్దేరసఖాంబరేందుగణితే (1006) జ్యే ష్ఠేథమా సేసితే
పక్షేపూర్ణతీథౌ దినే సురగురోర్జ్యేష్ఠాం శశాంకేగతే