పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

18

(1) [1]వేములవాడభీమకవి వేగమె చూచి కళింగగంగు తా
      సామముమాని కోపమున సందడిదీరిన రమ్ము పొ మ్మనెన్
      మోమును జూడ దోషమిఁక ముప్పదిరెండుదినంబు లావలన్
      జామున కర్ధమం దతనిసంపద శత్రులఁ జేరుఁగావుతన్.

(2) వేయిగజంబు లుండఁ బదివేలతురంగము లుండ నాజిలో
     రాయలగెల్చి సజ్జనగరంబునఁ బట్టము కట్టుకో వడిన్
     రాయకళింగగంగ కవిరాజు భయంకరమూర్తి చూడఁదాఁ
     బోయిన మీనమాసమునఁ బున్నమపోయిన షష్టినాఁటికిన్.

వీనిలో మొదటిపద్యముచే భీమన రాజును దిట్టి పదభ్రష్టుని జేసెననియుఁ బిదపఁ గొంతకాలమునకు రెండవపద్యముచే దీవించి పదస్థుని గావించె ననియు గాథ కలదు. అది కవిజీవితములలోఁ జూడ నగు.

ఈపద్యములును జూటువులే కాఁబట్టి ప్రబలప్రమాణములు కావనితోఁపవచ్చును. చాటువులేయైనను భీమనకృతములని యన్నిమతములవారు నేకగ్రీవముగ నంగీకరించి యుండుటచేతను, మొదటి పద్యములో భీమనపే రుండుటవలనను, నీపద్యములప్రామాణ్యమును బాధించు హేతుపులు లేకుండుటనుబట్టియు వాని నాధారముగా గ్రహించుట కాక్షేపముండఁగూడదని నాయభిప్రాయము. ఈపద్యములలోఁ గళింగగంగు, రాయకళింగగంగు నని పేర్కొనఁబడిన రాజెవ్వఁడో నిర్ణయింపవలయును. 999 స

  1. లేములవాడ భీమునవలీలనుజూచి-యను పాఠాంతరముగలదు.