పీఠిక
16
యుఁ గూడఁ బదునాల్గవశతాబ్దాదియం దుండినవా రని నిశ్చయింపవలసి యున్న దనియు వ్రాసినారు. ఈపద్యము భీమకవి చెప్పిన దనుట కప్పకవి సాక్ష్యముతప్ప వేఱొకసాక్ష్యము లేదు. అప్పకవి భీమనకాలమువాఁడు గాఁడు. సాహిణిమారుని కాలమువాఁడును గాఁడు. వారిరువురకు నెంతో తరువాతివాఁడు. నన్నయభట్టాంధ్రశబ్దచింతామణి కలియుగమునకాదిని రచియించెనని వ్రాసినయాతఁ డితఁడే. ఈతఁడన్న మాత్రాన నాపద్యము భీమనరచియించినదే యని యెట్లు విశ్వసింపవలెనో తెలియదు. ఈయప్పకవియేకదా భీమకవియు నన్నయభట్టును సమకాలికులని వ్రాసెను. దానికినిదీనికిని నెట్లుసమన్వయము చేయవచ్చును? ఇట్టిసాక్ష్యమునుబట్టి తీర్మానములు చేసినయెడల సత్యముతేలదు.
కవిజనాశ్రయములోని యతిచ్ఛందోధికారమునందు –
(2) క. ద్వీపమునకు నాకమునకు, నాపై శాస్త్రోక్తి వచ్చు లాదేశసమా
సాపత్తి గలుగుటయు వళు, లాపాదింపుదురు కొంద ఱచ్చును హల్లున్ .
అను లక్షణమునుజెప్పి, లక్ష్యములుగాఁ గావ్యాలంకారచూడామణి నుండి-
ఉ. ద్వీపులఁ ద్రుంచి విశ్వజగతీపతి యుత్తమశక్తి జూంబవ
ద్వీపమునందు గోవులకు నిమ్ముగఁ జేయుటయుం బ్రసన్నయై
గోపతిధేను వవ్విభునకుం దనవైభవ మిచ్చెఁగాకయే
భూపతు లీవదాన్యగుణబుద్ధిఁ బ్రసిద్ధివహించి రుర్వరన్.
క. నీకరవాలముపాలై, నాకంబున కరిగి రాజనారాయణ యా
భూకాంతులెట్టిచనవో, నాకవిటోత్తములఁ దూలనడుతురు లీలన్ .