పీఠిక
14
లాదిత్యుఁడు గాని, విమలాధీశుఁడుగాఁడు. విమలాధీశుఁడన విమలాదిత్యుఁ డెట్లగునో తెలియకున్నది. విమలాధీశుఁ డననర్థ మేమి? ఇదియొకదోషము. విమలాధీశునకు వెలుంగాధీశుఁడనుపే రెట్లు కలిగినదో తెలియదు. తెలుంగురాయఁ డనినట్లు వెలుంగురాయఁ డని కాని, వెలుంగురా జని కాని, రూఢనామ మున్నదా? లేదు. విమలశబ్దము విశేషణము. వెలుఁగుశబ్దము విశేష్యము. ఈరెంటికి నర్థములో భేదమున్నది. భీమనవంటిమహాకవి విమలాదిత్యునిసంబోధించు నవసరమున నతనిని సరియైన పేరు పెట్టియే పిలుచునుగాని యిట్లవకతవకగా నేల మార్చును? ఇది రెండన దోషము. వెలుంగాధీశ యనునప్పుడు సంధి యెట్లు కుదిరినది? వెలుంగు + అధీశ, యనికదా పదచ్ఛేదము. సంస్కృతసమాసము చేసినచో "వెలుఁగ్వధీశ" యని కావలయును. "తెలుఁగుసమాసము చేసిన యెడల "వెలుంగధీశ” యగును, “వెలుంగ + అధీశ” యని రెండుపదములు సంబోధనాంతములే యన్నపక్షమున “వెలుంగయధీశ" యని యుండవలెను. "వెలుంగాయధీశ" యని యుండిన నుండవచ్చును. ఏవిధముగాఁ జూచినను "వేలుంగాధీశ”యని కానేరదు. ఇది మూఁడవదోషము. త్రిదోష సహితమయిన యీవాదము శ్రీరామమూర్తిగారిమనస్సున కెట్లువచ్చినదో తెలియకున్నది.
ఈపద్యములో "వెలుంగాధీశ" యనుటకు బదులుగాఁ “దెలుంగాధీశ" యసుపాఠమును జెప్పి, తెలుంగురాయఁ 14 వ శతాబ్దమువాఁడు గావున భీమనయు నా కాలమువాఁడే యని వీరేశలింగముగారు నిర్ణయించిరి. ఈ పాఠమునకు శ్రీరామ