11
కవిజనాశ్రయము
పోదు. ఈప్రతీతిని దృఢపఱుచుటకు వేఱొకసాధనము గూడఁ గలదు. రేచన జైనకోమటిగదా. పూర్వకాలమందు గోదావరీ మండలమునఁగూడ జైనమతము వ్యాపించి యుండె ననుటకు సందేహములేదు. కాని, భీమకవికాలమం దుండె నని చెప్పుట కాధారములు కనఁబడలేదు. వెలిగందల ప్రాంతదేశమం దిప్పటికిని జైనకోమ ట్లున్నట్లు కనుపట్టుచున్నది. ఈవిషయ మయి వేములవాడ గ్రామస్థులు:-
"యీగ్రామమందు వెన్కటికి జైనమతస్థులు చాలా వుండిరి. ఆ జైనమతస్థాపనా అయిన దేవాలయములు వున్నవి. యెక్క డనగా మూడేపల్లిలో, విలాసవరంలో, కొత్తపల్లిలో, నగనూరిలో మొదలుగాగల గ్రామములలో వున్నవి. యీ గ్రామములు వేములవాడ సమీపగ్రామములు. ఆజైనమతస్థులైన కోమట్లు యిప్పటికి జగత్యాలలో, దోమకొండలో, బిక్కనూరిలో వున్నారు. ఆగ్రామములున్నూ వేములవాడ సమీపంగానే వున్నవి”
అని వ్రాయుచున్నారు.
భీమకవి వెలిగందలవేములవాడగ్రామనివాసి యని యా ప్రాంతమందుఁ బ్రతీతి యుండుటంబట్టియు, గ్రంథావతారికలో భీమన తనయిష్టదైవము వేములవాడ భీమేశ్వరుఁడే యని చెప్పుటంబట్టియు, వెలిగందల వేములవాడలో భీమేశ్వరాలయ ముండుటవలనను, నాఁటికినేఁటికినిగూడ నాప్రాంతమందు జైను