Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

10

"యేయింటిలోపల ప్రయోజనం అనగా అంన్న సంతర్పణ అయివుండెనో ఆయింటివారు నాటనుంచి అప్పాల (పప్పల) వారని పేరుగలవారై యున్నారు. అంతకుముందు వీరియింటిపేరు కొండపలక అని వుండెను. ఆవంశం పరంపరా యిదివరకు జరుగుతు వుంన్నది.”

అని వ్రాసినారు. మఱియు, భీమన యిష్టదైవ మయిన భీమేశ్వరుని గూర్చి వారే యిట్లు చెప్పుచున్నారు.

“వేములవాడలో భీమాలయము మహాదండిది కలదు. రాజేశ్వరమహాత్మ్యములోపల యా రాజేశ్వరుణ్నిన్ని భీమేశ్వరుడని చెప్పి వున్నది. ఆలయము మిక్కిలి విశాలమైనది. లింగము మిక్కిలి గొప్పది. ఇటువంటి దేవాలయ నిర్మాణము యెక్కడ లేదు. జై నవిగ్రహములు భీమేశ్వరాలయములో లేవు, అచ్చటి కోనేరును యేబది సంవత్సరముల కింద పూడ్చి వేసినారు. ఆ కోనేరుయొక్క కణీల తెచ్చి రాజేశ్వరస్వామి సన్నిధియందున్న సరోవరము తంతెలుగా నిర్మాణము చేసిరి. భీమకవినర ప్రదాత యీభీమేశ్వరుడే"[1]

వీరు వ్రాసినదంతయు విశ్వాసపాత్ర మని చెప్పుట కవకాశము లేదు, గాని, భీమకవి యాప్రాంతమువాఁ డనుప్రతీతి యచట నిప్పటికి నున్న దనుట కిది ప్రబలప్రమాణము కాక

  1. భీమకవి వెలిగందల ప్రాంతమువాఁ డైనట్లుగ నచ్చటఁ బ్రమాణము లేమైన నున్నవేమో తెలిసికొని రావలయునని పరిషత్పక్షమున - 1915 సం. జూలై నెలలో దూపాటి తిరుమల వేంకటరమణాచార్యులు గారిని బంపఁగా నాయన వేములవాడగ్రామనివాసులలోఁ గొందఱచే నొకపత్రము వ్రాయించి తెచ్చెను. ఆపత్రములోని భాగములే పై నుదాహరింపబడినవి.