పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

కవిజనాశ్రయము

వాడయను పేరు గలిగిన దనియు వేములవాడ ప్రాంతమందుఁ బ్రబలమైన వాడుక గలదు. రాజరాజేశ్వరుఁడను రా జీదేశము నేలినట్లు శాసనప్రమాణముకూడఁ గలదు.[1]

పూర్వోదాహృతావతారికాపద్యములో భీమన కిష్టదైవమైనభీమేశ్వరుఁడు 'వేములవాడను వెలసిన' ట్లున్నది, గాని, దాక్షారామములోనిదేవుఁడనిలేదు. వెలిగందల వేములవాడలో భీమేశ్వరుని యాలయ మొకటి గొప్పది యున్నది. భీమకవి యా యూరివాఁడే యైన ట్లాప్రాంతమందు దృఢమైన ప్రతీతి యున్నది. ఈ వషయముం గూర్చి యాగ్రామమందలి తగుమనుష్యులు కొందఱు

"వేములవాడ భీమకవి యీ గ్రామనివాసి యని యీ గ్రామములో పరంపరా చెప్పుకొను వాడుక గలదు.”

"భీమకవి యీగ్రామంలో జన్మించి ప్రబుద్ధుడై ప్రాగ్దేశమందు కళింగరాజు వుండే గ్రామమునకు పోయినట్టు వినుకరి వుంన్నది.”

“ఆ భీమకవి వైదీకుడే. పూర్వమందు మాకు వార్కి సంబంధంబులు వుండెనని చెప్పంగ విని వుంన్నాము."

అనివ్రాసి, భీమకవి శాపముచే నన్నము సున్నము , పప్పలు కప్పలు నయ్యె నను కథ నుదాహరించి-

  1. సారంగధరచరిత్రములోని యితివృత్త మీ నామపల్లియందే జరిగినదని వేములవాడవాస్తవ్యుల నమ్మకము.