Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

4

బ. పరిషత్సంఖ్య 320. సమగ్రము. పిళ్లపాళియం సుబ్రహ్మణ్యముగా రిచ్చినది.

ఈ ప్రతులలోఁ దొమ్మిది తాటియాకులమీఁద వ్రాయఁబడినవి. వీనిలో ననేకములు ద్రవిడదేశమున దొరకినవి. పరిషత్పుస్తకభాండాగారమునం దున్నవి. ద. యనునది కాగితపుఁ బుస్తకము. సి. పి. బ్రౌనుమహాశయుని యాజ్ఞానుసారముగాఁ బరిష్కరింపఁబడిన ట్లగపడుచున్నది. కాని, కొన్నిస్థలములయందుఁ బరిష్కర్తలు సంప్రదాయముతెలియక యొప్పులఁ దప్పులుగా దిద్దినారు. పైప్రతులలోఁ గొన్ని యసమగ్రములు. కొన్ని సమగ్రములు. వ్రాఁతతప్పు లన్నిటియందును గలవు, ఇది లేఖక ప్రమాదజనితమా, లేక కవి ప్రయుక్తమాయని నిర్ణయించుట కష్టమని తోఁచుపట్టు లచ్చటచ్చట నున్నవి. కవ్యుద్దేశమునకు భంగము కలుగకుండ వ్రాఁతతప్పులను మాత్రమె దిద్దవలయు నను సంకల్పముతో నాబుద్ధికిఁ దోఁచినట్లు సవరణలు చేసినాఁడను. పాఠభేదము లున్నచో నాయాపుటలయం దడుగునఁ జూపినాఁడను. కొన్నిపద్యములు కొన్నిప్రతులయందుమాత్రమే యున్న యెడల నవి యేప్రతులందున్నవో సూచించినాఁడ. అన్య గ్రంథములనుండి తెచ్చి యిందుఁ గలిపినపద్యములఁ బరిహరించినాఁడ. ప్రక్షిప్తము లని తోఁచిన పద్యముల ననుబంధముగాఁ గూర్చినాఁడ. కన్నడ ఛందమునకును దెలుఁగుఛందమునకును గలసామ్యము లచ్చటచ్చటఁ గనఁబఱిచినాఁడ. ఇవి జాత్యధికారమునం దధికముగా నున్నవి. వ్రాఁతపుస్తకములు శోధించుట