పీఠిక
2
క . “ చిదంబరము పుస్తకము” అనుపేరుతో నున్నది. ఈప్రతి దోషాధికారాంతమును బూర్తిగ నున్నది. దానిపిదప ఛందోవిషయమైన సీసమాలిక గలదు. అది కవిజనాశ్రయములోఁ జేరినది కాదు. ప్రతి యంతప్రాఁతదికాదు. అచ్చటచ్చటఁ దప్పులుకలవు. మొత్తముమీఁద మంచి ప్రతి. ఇది పరిషత్పుస్తక భాండాగారమం దున్నది.
చ. పరిషత్సంఖ్య 3. ఈ సంపుటములో మొదట నాంధ్ర కౌముదియుఁ, బిదపఁ గవిజనాశ్రయమును గలవు. అంత మంచిప్రతి కాదు. అసంపూర్ణము. వేంకటేశయ్యగా రిచ్చినది.
ట. పరిషత్సంఖ్య 31. ఈసంపుటములో లక్షణశిరోమణియును గవిజనాశ్రయమును గలవు. కవిజనాశ్రయము లయవిభాతిలక్షణమువఱకు నున్నది. అంత మంచిప్రతి కాదు. .
త. పరిషత్సంఖ్య 34. ఈ సంపుటములో 1 కవిజనాశ్రయము, 2 ఆంధ్ర భాషాభూషణము, 3 కవిజనాశ్రయఘు, 4 అంగజవిజయమును గలవు. అసంపూర్ణము.
స. పరిషత్సంఖ్య 65. అక్కరలవఱకు మాత్ర మున్న ది. మంచిప్రతి. పుదుకోట రత్నసామయ్య బి ఏ. గారిచ్చినది.