Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక.

గ్రంథప్రయోజనము.

కవిజనాశ్రయ మనునది యీగ్రంథమునకు గ్రంథకర్త యిడిన పేరు. లోకములో దీనికి సర్వసాధారణముగా భీమన ఛంద స్సను వాడుక కలదు. దీనికిఁ గారణము ముందు దెలియఁ దగును. ఈ గ్రంథములోని పద్యములు కొన్ని సులక్షణ సారమునందుఁ జేరియున్నవి, గాని, కవిజనాశ్రయ మింతవఱకు నెచ్చటను సమగ్రముగ ముద్రింపింపఁబడి యుండలేదు. ఆంధ్రచ్ఛందోలక్షణము సవిస్తరముగ నెఱుంగఁగోరువారల కప్పకవీయమునకు మించినగ్రంథము లేదని చెప్పవచ్చును, గాని, యది పెద్దది యగుటచేత ఛందోలక్షణము సంక్షేపముగ గహింపవలయు ననువారికిఁ గవిజనాశ్రయ ముపయోగపడిన ట్లది యుపయోగపడదు. మఱియును, గవిజనాశ్రయ మాంధ్రచ్ఛందో గ్రంథములందెల్లఁ భ్రాచీనతమమయిన ట్లగపడుచున్నది, కావున, ఛందోలక్షణము కాలక్రమమున నెట్లుమాఱినదియుఁ దెలియఁగోరు విద్వాంసులకు మిక్కిలి యుపకరించును.

పాఠనిర్ణయము.

ఈక్రింది వివరింపఁబడు పది వ్రాఁతపుస్తకముల శోధించి యీగ్రంథపాఠము నిర్ణయింపఁబడినది. అవి యేవియన —