Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

కవిజనాశ్రయము.

చంద్రరేఖావృత్తము.
   సారంబై చంద్రరేఖన్ జంచన్మరేఫల్ మయాసం
   చారంబుం జెంది పొందున్ సప్తోదయద్విశ్రమం బై. 24

హంసయానావృత్తము.
   ఆనతారిరేచ ! హంసయానకొప్పుఁ గుంజర
   స్థానవిశ్రమంబుగా రజద్వయుబు రేఫతో. 25

ఆకృతిచ్ఛందమందు :-
విచికిలప్తబకవృత్తము.
   శబర నికృతిధర ! పురహర ! సవితృవిరతి విచికిల
   స్తబకమున నిరువదిలఘువులు చన లగ మొగిఁబెనఁగున్.[1] 26

వికృతిచ్ఛందంబునందు :--
పద్మనాభవృత్తము.
   ఎన్నంగ నీతం డనాద్యంతుఁ డంచుం బ
        రీక్షింతు రెవ్వాని వాఁ డెల్లనాఁడున్
   నన్నేలు నా నర్కవిశ్రామ మై పద్మ
        నాభం బగున్ సప్తతంబుల్ గగంబున్. 27

మత్తాక్రీడితవృత్తము.
   మత్తాక్రీడితం బన్ వృత్తం బౌఁ ద్రిదశయతి
        మయమననననవముల్. [2] 28


  1. ద్వితీయపాదమందు యతి చెడినది.
  2. యతి చెడినది. మత్తాక్రీడాఖ్యం బెంపారు న్మమతననననవమహిత మగుచు ర,త్నాత్తబ్రహ్మశ్రాంతు
    ల్గ్రందై (అప్పకవీయము).