Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దోషాధికారము.

81

   ననఁగను నభీక్ష్ణ మి మ్మి
   మ్మనఁగాఁ గృతులన్ గ్రియాసమభిహార మగున్. 7

క. తనసత్యము తనశౌచము
   తనశౌర్యము తనవిశిష్టదానము చతురా
   ననునకుఁ బొగడఁగ మిక్కిలి
   యని యీక్రియఁ జెప్పినది పదావృత్తి యగున్. 8

క. మొదలిక్రియతో నమర్పక
   విదితవిరుద్ధార్థయుక్తి విపరీతం బై
   తుదఁ గ్రియరాఁ జెప్పిన వ్య
   ర్థదోష మని రఖిల కావ్యతత్త్వవిధిజ్ఞుల్. 9

క. [1]పొడిచి యొడువంగఁ బగఱను
   గడుఁ గరుణాపరుఁడ వీవు కావున నీ క
   ల్గెడువారు లేరు పగ ఱె
   క్కడ నని యిప్పాటఁ జెప్పఁగా వ్యర్థ మగున్. 10

క. దినకరుఁడును హిమకరుఁడును
   మనసిజుఁడును బోల్స నీసమానులు సత్కాం
   తి నుదాత్తతేజమున సొబ
   గున ననిన నపక్రమం బగున్ వ్యుత్క్రమ మై. 11


  1. చూ: అరినృపబలమంగెల్దర్ | పరాక్రమక్రమదె శౌర్యమం ప్రకటిసునీం | నరమహితా నినగే నహి ! తరు మొళరే సతత పరహితాచార పరా. (కవిరాజమార్గము.)