Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షట్ప్రత్యయాధికారము.

77

క. [1]ధరవృత్తసంఖ్యలో సవ
   మురుముం జేసినను గూడు మొన్కడ లఘువుల్ [2]
   గురువులు సమవిషయంబులు
   విరచింపఁగఁ జెడినయట్టివృత్తము వచ్చున్. 4

క. [3]ఒక్కటి మొద లిడి మడుపుచు
   నక్కడఁ దుదదాఁక లఘువులందలిలెక్కల్
   లెక్కించి కూడఁ బదపడి
   యొక్కటి మఱి యందుఁ గూడ నుద్దిష్ట మగున్. 5

క. తరతరమ దొంతివృత్తా
   క్షరములు లెక్కాదికంబుగా నిల్పి యధో౽
   క్షరము లుపర్యక్షరములు
   పరువడిఁ గూడుచు నుపాంతపర్యంతముగాన్. 6

క. కలయ నుపాంతాధో౽క్షర
   ము లుపాంతములందు నిల్పి మునుగూడిన నొ
   క్క లగక్రియ (తత్పిండిత)
   మలవడ సద్వృత్తసంఖ్య మల్లియరేచా ![4] 7


  1. క-వృత్తసంఖ్యార్థమున్ దుదివిషమమైన | గురువు లిడుచును నొక్కటి గూర్చి మఱియు |దళముచేయుచు సమసంఖ్య దగఁగ లఘువు | దనర నిడినను నష్టవృత్తంబు వచ్చు.
  2. ఈపాదము సమన్వయముగా లేదు.
  3. డ-లో నున్నది. క-ఆది రెండిడిమడుపుచు నలర గురువు | లున్ననొక్కటి దరపుచు నన్ని యక్క, రముల నీరీతిమడుపంగఁ గ్రమముతోడఁ, దెలిసి సుకవులు దీని నుద్దిష్ట మండ్రు.
  4. ళ-లో "నొక్కలగక్రియ” యనునంత వఱకు మాత్రమే యున్నది.