పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాత్యధికారము.

75


[1]షట్పదము.

[2]త్రిదశేంద్రగణములు వెలయ (నిర్) మూఁడిడి
       కదియ నంత్యంబునఁ జంద్రుఁ గూర్చి
[3]తుది యిట్లుగా మదిఁ జె (ప్పిననదియ) ష
       ట్పద మగు మల్లియ రేచ(నాఖ్య). 33

గద్యము. [4]ఇది వాదీంద్రచూడామణిచరణసరసీరుహమధుకరాయమాన శ్రావకాభరణాంకవిరచితం బైనకవిజనాశ్రయంబనుఛందంబునందు జాత్యధికారము.


___________
  1. కొందఱు లాక్షణికులు పట్పదపాదమునకుఁ ద్రిప్రాసము విధించిరి. యతి యెందును లేదు.
  2. చ-డ-లలో మాత్ర మున్నది. కన్నడములో నాఱువిధముల షట్పదములున్నవి. వాని సామాన్యలక్షణము. తోఱునమాత్రెయషట్పది! గాఱాఱడియెరడఱల్లి మొందే నియమం ! మూఱక్కొందు తదర్థం | బేఱీళం కడెయొళెల్లమీతెఱనక్కుం.
  3. తుది యిట్లుగా మదిఁజెప్పుటయును షట్పద యగు మల్లియ రేచన వినవే. (అని మాతృక)
  4. డ - లో మాత్ర మున్నది.