పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

కవిజనాశ్రయము.


- ద్విపద. -

ఇంగ్రణములు మూఁడినగణం బొకటి
చంద్రాస్య! ద్విపదకుఁ జనుఁ జెప్ప రేచ![1] 30

- త్రిపద. -



[2]త్రిదశేంద్రు లాఱగు పదియగు నెడనకున్
గదియ రెంటను మూఁటను
నదుకుడుఁ ద్రిపదకు నమరు. 31

- చౌపద. -



నలగా భసలను నాల్కిటిలోనన్[3]
వలసిన నాలుగు[4] వడిగాఁ బూనన్
వెలయ గణద్వయవిశ్రమ మైనన్ [5]
అలవడుఁ జౌపద కన్వితమైనన్. [6] 32

  1. ద-కృతుల.
  2. ఇది కన్నడలక్షణమును బోలియున్నది. బిసరుహోద్భవగణం రసదళస్థానదొళ్ | బిసరుహ నేత్రే! గణమె బర్కుళిదవు! బిసరుహనేత్రే! త్రిపదిగే. (క. ఛం)
  3. ద-నలగాభజసల నైదిటిలోనన్.
  4. త్రిగణము--అని పాఠాంతరము.
  5. చ-డ-లలో వలసిన త్రిగణము వడిహగణానన్, జలయ గుణధ్వనివిశ్రుత మైనన్.
  6. ద-చౌపద కాఖ్య యెసంగున్. చౌపదతరువాత ద-ప్రతిలో రగడలు, మంజరి, ఉదాహరణము, గీతము వీనికిలక్షణములు , లక్ష్యములు చెప్పబడినవి. ఇవి తఱచుగా విష్ణుపరముగా నుండుటచేఁ బ్రక్షిప్తములుగాఁ నెంచఁదగియున్నవి. ఈపద్యములు షట్పదలక్షణము తరువాత క-ప్రతిలోఁగూడఁ గన్పట్టుచున్నవి. కన్నడచౌపది లక్షణము, మదనన తందెయముం | దొదవిద శంకరనొళ్ | పుదిదిరెసందుదునో | డిదు, సతి ! చౌపదిగే. (క. ఛం).