Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాత్యధికారము.

69

యోదిత మైన నెత్తు
గీదియ యొప్పుఁ గృతుల.[1] 20

- ప్రగీతి. -



[2]మూఁడుసేసినగణములు[3] రెండు నలములు
మూఁ డినగణములును మొగి నహంబు
పోఁడి గాఁగ నర్ధమున కగుమీఁద ని
[4]ట్లుండఁ జెప్పవలయు నొగిఁ బ్రగీతి. 21

- మేలనగీతి. -



[5]ఒనర నేడ యైన[6] గణము లొప్పఁ బెరసి యుండ
ఘనతరముగ వళ్లు నిట్లు గలసియుండ నిలిపి

  1. క-గీతి యయ్యెఁ గృతులందు.
  2. ఈలక్షణ మాటవెలఁదికిని జల్లును, గాని యందుఁ బ్రాసము లేదు. 2, 4 పాదముల చివర నగణము నుండ పచ్చును. దీనినే యప్పకవి పవడగీతి యని వాడెను
  3. సేసి + ఇనగణములు.
  4. ప్రాసమువిచారణీయము . మూఁడు, పోఁడి శబ్దములు పూర్ణానుస్వారమధ్యములుగా
    గ్రహించినచోఁ బ్రాసము సరిపోవును.
  5. క-డ-లలో మాత్ర మున్నది. క-లో 2, 3 పొదములు- ఘనతరంబుగాఁగ నిట్లు గలసియుండ
    నిలిపి, వినుత మేలగీత విస్తరంబుగాఁగ (రెండవపాదమం దొకగణము లోపించినది.) డ-1వ పాదము. ఒనర నయినగణము లొప్పఁ బెరసియుండ. (ఒక గణము లోపించినది).
  6. ఏడు + అ = ఏడ. ఐనగణములు = ఇనసంబంధ గణములు. హగణ మైనఁ జాలు నగణమైనఁ జాలు హగణ 1 నగణములును రెండు గలసి నాటియంఘ్రికేడు 1 తగినవిరతి నాలుగింటఁ దనరఁ బ్రాస మొదవి! మిగుల మెఱయుచుండుఁ గృతులఁ గమలనాఖ్యగీతి. (అప్పకవీయము.) నాల్గవపాదమందు యతిభంగ మగుటచేఁ గవియభిప్రాయము "మేలనాఖ్యగీత" యని యైనఁ గావచ్చును.