Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

కవిజనాశ్రయము.


- తరువోజ. -

   [1]నలనామగణము లినగణంబుతోడ
             నాలుగుగాఁ జేసి నాటించి యిట్లు
   కలయంగ నెనిమిది గణములై రెండు
             గణములతుద యతిగా నిల్పి యమర
   వెలయంగఁ బాదముల్ విరచింప వళ్లు
            వేర్వేఱ నిప్పాట విదితమైయుండ
   సలలితగతిఁ గృతి చనఁ జెప్పుఁ డనియె
            జానుగాఁ గవిజనాశ్రయుఁడు తర్వోజ. 19

- గీతులు. -



వ. మఱి గీతు లన్నవి విషమగీతులు, సమగీతులు నన రెండు తెఱంగు లయ్యె. [2]అందు విషమగీతులు ఎత్తుగీతి, ప్రగీతి, మేలన[3]గీతి యనం బరఁగె, అందు,

- ఎత్తుగీతి. -



     [4]శ్రీదయితాధిపా న
     యోదయ వల ననత్ర

  1. ద-లో "సీ. నలనామషట్క మినగణద్వయంబుతో నాలుగుగాఁ జేసి నాటి యిట్లు! కలయంగ నెనిమిదిగణము లయ్యెను రెండు గణములతుద యతిగాఁగ నమర | వెలయంగఁ బాదముల్ విరచించి వళ్లు వేర్వేఱ నిప్పాటను విదితముగను. సలలితగతిఁ గృతి చనఁ జెప్పుఁడనియెను జానుగాఁ గవిజనాశ్రయుఁడు దనర.” ఇది సీసపద్యలక్షణముగాని తర్వోజలక్షణముగాదు.
  2. "అందు విషమగీతులు వైతండికంబు లనం బరఁగె" నని కొన్ని ప్రతులలో నున్నది.
  3. ద- మెలకగీతి.
  4. లక్షణ మస్పష్టము. ఒక యింద్రగణము రెండు సూర్యగణములుచేరి యొకపాదమని లక్ష్యము తెలుపుచున్నది. ప్రాసమున్నది. యతిలేదు. సురనాథుమీఁద సూరు లిరువురు రెంట విరతి, ధరణిఁ బ్రాసంబు దనరు నెత్తుగీతియందు. —అప్పకవీయము (వావిళ్లవారి ప్రతి) ఇందు నాల్గవపాదమున గణభంగ మున్నది. రెండవపాదమందు యతి లేదు.