పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

కవిజనాశ్రయము.

   బులుగా నాలుగు పదములఁ
   జెలు వగు నొకగీతితోడ సీసం బమరున్. 12

క. నలనగసలభరతగణం
   బులు నొడఁబడి వాని పాదముల నొక్కటి యై
   కలయ[1] నహంబులు నట్లన
   కలయ నొడంబడి పెనంగుఁగాఁ దమలోనన్. 13

వ. సీసంబు లన్నవి విషమసీసంబులు, సమసీసంబులు నన రెండు దెఱంగు లయ్యె. అందు,

విషమసీసం బెట్టి దనిన.

   [2]ఊహ నేడు గణములుగను నొనర నగణ మొండెఁ ద
   త్సాహచర్యమొండె గురుకసహితముగ నొనర్ప ను
   త్సాహ మయ్యె నిదియునుం బ్రశస్తముగ నొనర్ప ను
   ర్వీహితోరుచరిత యదియ విషమసీస మై చనున్

   బ్రాలు వళ్లు లీల నోలిని నిలిపి యా
   గణమ కాని యొండుగణము లిడక
   యభినుతార్థరచన యభినుతమై యుండఁ
   జెప్ప విషమసీస మొప్పుఁ గృతుల. 14

  1. ద-గలుగు.
  2. ప-లో, ఊహనాఱు నినులగణము లొనరరగణ మొందఁ ద , త్సాహచర్య మాదిగురువుసహితముగ నొనర్పను , త్సాహమయ్యె నిది వినం బ్రశస్తముగ రచింపను. (నాలుగవపాదము సమానము.) గీతము లేదు.