Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాత్యధికారము.

63


- తెనుఁగు జాతులు.[1] -



క. [2]వెలయంగఁ దెనుఁగు బాసకుఁ
   దల మయ్యెడు సీసములును దర్వోజలు గీ
   తులు నక్కరలును ద్విపదలు
   పొను పొందఁగ రేచఁ డిష్టమున నొనరించున్[3] . 10

- సీసములు. -



క. [4]ధాత్రిన్ గవిత్వతత్త్వము
   పాత్రతఁ గడునొప్ప వెలయుఁ (బ్రాజ్ఞులచేతన్)
   మాత్రోక్తి నష్టగణముల
   మాత్రలు సీసముల కెల్ల మల్లియరేచా ![5] 11

క. [6]నలనగసలభరతలలో
   పలనాఱును మీఁద రెండు పద్మాప్తగణం

  1. ఈశీర్షిక మాతృకలో లేదు.
  2. చూ. అర్ణవ జాతాననె సం, పూర్ణతెయిం సకలవిషయ భాషాదిగళం, నిర్ణయమాగఱుపిదెనాం, కర్ణాటక భాషెయందమం కేళ్ పేళ్వెం. (కర్ణాటకచ్ఛందోంబుధి.)
  3. చ-లోద గ్వోజలు నం, దుల షట్పదములు నక్కరములు ద్విపదలు రేచఁ డిష్టముగ నొనరించున్. ప- 4- వపాదము. బలురగడలు మంజరియును బలుకుదుఁ గృతులన్.
  4. సీసమునం దష్టవిధము లగుమాత్రాగణము లుండు నని యీపద్యము నుత్త రార్ధము భావము.
  5. క -ప - లలో, మాత్ర వసు దశమ నవష, ణ్మాత్రలు సీసముల కెల్ల మల్లియరేచా. మఱియొకపాఠము. మాత్రోక్తి దశమ నవష, ణ్మాత్రలు మాత్రలకు నెల్ల మల్లియరేచా.
  6. చ - నలనగసల భరతగణం, బులు గూడఁగ వానిపాదములు నొక్కెడలన్ , గలయ నహంబులు రెండున్, గలయన్ సీసము బెడంగుగా నిడవలయున్.