Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

కవిజనాశ్రయము.


- గీతి, ఉపగీతి, ఉద్గీతి. -



క. [1]అమరఁగ నార్యాపూర్వా
   ర్ధమునన చెప్పునది గీతి, తత్క్రియనపరా
   ర్ధమున నుపగీతి, తద్వ్యు[2]
   త్క్రమమున నుద్గీతి యగు జగద్గీతయశా ! 9

  1. ఆర్యాప్రథమార్ధమును బోలియే ద్వితీయార్ధముకూడ నుండిన నది గీతి యనియు , ఆర్యాద్వితీయార్ధమును బోలి ప్రథమార్ధము కూడనుండిన నది యుపగీతియనియు , ఆర్యా పథమార్ధమునుబోలి ద్వితీయార్ధమును, ద్వితీయార్ధమునుబోలి ప్రథమార్ధము నుండినచో నది యద్గీతి యనియు నర్థము. ఈలక్షణములు వృత్తరత్నాకరమునందలి లక్షణముల ననుసరించి యున్నవి.
    నృత్తరత్నాకరమం దార్యాగీతి యను నింకొకగీతి చెప్పఁబడినది. దానిలక్షణము:- ఆర్యాపూర్వార్ధం యది గురు ణైకే నాధికేన నిధనే యుక్తం, ఇతర త్తద్వన్నిఖిలం దలం యదీయ ముదితే౽యమార్యాగీతిః. ఇది కందపద్య లక్షణమునకు సరిపోవును. ఛందో౽ంబుధిలో గీతిమాత్రము చెప్పఁబడియున్నది.
  2. ద-తత్క్రియఁ బశ్చా,ర్ధమునందుఁ జెప్పఁగా నీ, వీనితో సాంస్కృతికజాతులు. సమాప్తము.