ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జాత్యధికారము.
61
క. [1]కందము - త్రిశరగణంబుల
[2]నందును, గాభజసనలము లైదునె గణముల్ ;
పొందును నాఱిట నలజము,
లొందుం దుదిగురువు, జగణ మొప్పదు [3]బేసిన్. 6
క. [4]నెల వెఱిఁగి నిడుదపాదం
బుల నాలవగణము మొదలఁ బొదలఁగ నిడఁ గా
వలయును వ ళ్లాపాదం
బులతుద గురు వమరఁ గందమున కిడవలయున్. 7
- ఆర్య. -
క. [5]క్రమమునఁ గందము రెండ
ర్ధములతుదన్ గురువు లుంచి, తప్పక కడయ
ర్ధము నాఱవయెడ లఘు విడ
నమితగుణైశ్వర్యధుర్య ! యది యార్య యగున్. 8
- ↑ కందము త్రిశరగణంబుల, నందము గాభజసనలము లట వడి మూఁటన్ ,బొందును నలజల నాఱిట, నొందుం దుదగురువు జగణముండదు బేసిన్ (సులక్షణసారము) .
- ↑ ప -నందముగా భజసనలములటముని యతిపై. ద-నందము గగభజసనలములైదే గణముల్.
- ↑ ద- ముండదు.
- ↑ ప-లో లేదు.
- ↑ లక్ష్మైతత్సప్తగణా గో పేతా భవతి నేహ విషమేజః ! షష్ఠోయంచ నలఘువా ప్రథమేర్ధే నియత మార్యాయాః, షష్ఠేద్వితీయలాత్పర కేన్లేము ఫలాచ్చసయతి పదనియమః | చరమే౽ర్దేపంచనుకే తస్మా దిహ భవతి షష్ఠోలః. (వృత్త రత్నాకరము). మిగదేళ్, గణముంబ కాన్ ,ర్య గెముంతం తుదియె ళొందె గురుతాంబంది , న్న గలదె పదార్థదొళ్ శిశు, మృగాక్షి ! లఘు వొందె బందు నిల్కుంరసదొళ్. మొదలొళ్ పన్నెరడె రడనె, యదఱొల్ పది నెంటు మూఱఱొళ్ పన్నెరడం, త్యదపాదదల్లి పదినె,య్దదుమాత్రా నియమ మార్యె యొళ్ వనజముఖీ (కర్ణాటచ్ఛందోంబుధి). కందపద్యము ద్వితీయ చతుర్థ పాదాంతగణములకుబదులు గా నొక్కొక్కగురువును , చతుర్థపాదమం దాఱవగణమునకు బదులుగా నొక్క లఘువును బెట్టినచో నది యార్య యగును. ఆర్యప్రథమతృతీయపాదములకుఁ బన్నెండేసిమాత్రలును, ద్వితీయ పాదమునకుఁ బదు నెనిమిది మాత్రలును, చతుర్థపాదమునకుఁ బదియేను మాత్రలునుండును.