పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

కవిజనాశ్రయము.

- కందము. -



క. ఆది గురు విడిన గురువే
   పాదాదుల నెల్ల నిలుపఁబడుఁ గందములం
   దాది లఘు విడిన లఘువే
   పాదాదుల [1]నిలుపవలయుఁ బరహితచరితా! 3

క. [2]వెలయఁగ గాభజసనలం
   బులు నేనును గాని కందమున కొండు గణం
   బులు చొరవు, వానిపాదం
   బుల నిడు నది మూఁడు నేను మూఁడు న్నేనున్. 4

క. [3]హిమకర పుర శర నగముల
   నమరుపఁగాఁ జనదు జగణ మందలిరెండ
   ర్ధములన్ నల ముండె జకా
   రమొండె నాఱవయెడం దిరము గావలయున్.[4] 5

  1. ద-నిడఁగ.
  2. ప-ద-లలో లేదు. గిరిశంధూర్జటి శర్వం, పురారి మఖరిపు వెనిప్పవింతెయ్దుగణం, బరె శశిపురవిషయాద్రియొ, ళిరదిర్కె, పురారి యెంబగణమబ్జముఖీ. (కర్ణాటకచ్ఛందోంబుధి)
  3. శశిపురబాణాద్రిగళొళ్ , బిసజముఖీ! మధ్యగురుగళాగల్ కందం, పుసియలై ? గండనిల్లద,
    శశివదనెగె గర్భ మాద తెఱనొళ్ కెడుగుం, (క-చం.)
  4. ఈ పద్యము తరువాత ప-ద-లలో- ద్వాదశ మాత్రలు మొదలిడఁ, బాదం బగు నాద్వితీయపాదంబునకున్, ద్వాదశమాత్రలు చన యతి, కాఁ దగు వసుమాత్ర లర్ధకందము రేచా! అను పద్య మున్నది.