Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

కవిజనాశ్రయము

జాత్యధి కారము.

క. [1]శ్రీకమనీయుఁడు వాణీ
   శ్రీక మనీయుండు ధాత్రి రేచన కీర్తి
   శ్రీకమనీయుఁడు సకలక
   ళాకుశలుఁడు చెప్పు జాతిలక్షణ మొనరన్ . 1

క. జాతులు మాత్రాసమక
   [2]ఖ్యాతగణప్రతతిఁ జెప్పఁ గందము లయ్యెన్
   గీతులు మొదలగునవి యుప
   జూతులు భూతలవినూత్న జాతయశస్కా! 2

  1. క-డ-ల-లో, శ్రీకాంతాసఖుఁడా శాం, తాకాంతనితాంతకాంతుఁ డగురేచన వా, క్ఛ్రీకమనీయుఁడు (శేషము సమానము). ద-లో, శ్రీకాంతాసఖుఁడును గాం, తాకాంతనితాంతకాంతుఁ డగుచు- సదావా,
    క్ఛ్రీకమనీయుఁడు (శేషము సమానము)
  2. క-ప-డ-లలో, ఖ్యాతగణప్రతతిఁ జెప్పఁ గందము లార్యాగీతులు మెదలగఁ గలయని (శేషము సమానము)