Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృత్తాధికారము.

51

భాస్కరవిలసితవృత్తము. -
     భాస్కరసదృశ సముజ్జ్వల తేజా !
          భాసుర భనజయభననసగంబుల్
     భాస్కరవిరమణబంధుర మైనన్
          భాస్కరవిలసిత మనిరి కవీంద్రుల్. 121

[1]జలదరవవృత్తము. -
     నన నన ననలు ననల నొడఁబడి
           నయవినయనిధి! వినుము రే
     చన ! మనుయతిని నిలుపఁగ మహిని
          జలదరవ మగు గురువుతోన్. 122

వ. [2]ఉత్కృతిచ్ఛందంబున కిరువదా ఱక్షరంబులు పాదంబు గా 67108864 వృత్తంబులు పుట్టె. అందు,

భుజంగవిజృంభితవృత్తము. -

     [3]ధీరాసారత్వోదారత్వస్థిరగుణ ! వసు
          దశమయతిన్ భుజంగవిజృంభితా
     కారం బారంగాఁ దోఁచున్ సంగతమమతన
          ననరసకారమై వయుతంబుగాన్. 123

  1. బ-లో మాత్ర మున్నది.
  2. ద-వ్యుత్కృతి.
  3. ద-ధీరాధారత్వోదారత్వాదృత.