Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

కవిజనాశ్రయము.

వ. [1]సంకృతిచ్ఛందంబున కిరువది నాలుగక్షరంబులు పాదంబుగా 16777216 వృత్తంబులు పుట్టె. అందు,

సరసిజవృత్తము. -
     మారాకారా ! చారుచరిత్రా !
           మతయననననస [2]మహియతిరచనన్
     సారంబైనన్ సూరికవీంద్రుల్
           సరసిజ మని వినఁ జదివిరి సభలన్.[3] 118

క్రౌంచపదవృత్తము. -
     పంచశరాభా ! సంచితపుణ్యా !
          భమసభ నననయపరిమితమైనన్,[4]
     గ్రౌంచపదాఖ్యం బంచిత మయ్యెన్
          గ్రమయతి దశవసుకలితము గాఁగన్.[5] 119

వ. [6]అభికృతిచ్ఛందంబున కిరువదియై దక్షరంబులు పాదంబుగా 33554432 వృత్తంబులు పుట్టె. అందు,

బంధురవృత్తము. -
     అమరఁగ ననననసభభభగయుతం
          బైతిథివిశ్రమ మొంది చనన్
     బ్రముదితకువలయ! పరహితచరితా !
          బంధుర మన్నది వృత్త మగున్ . 120

  1. చ-సత్కృతి. ప-నుకృతి.
  2. క-డ- మహితపురచనన్.
  3. చ-డ-ద- మొదలన్.
  4. క-ప- పరివృతమైనన్ .
  5. ప - రసదశకలితముగాఁగన్.
  6. క - లో నీఛందస్సు లేదు.