చెన్నపట్నం గవర్నరు దుర్గతి
91
పాటించకుండా వుండలేక పోతున్నారు. ఇప్పటి గ్రామాదులలో హిందువులూ, మహమ్మదీయులూ అన్యోన్యంగా వుంటూ వరసపెట్టి పిలుచుకుంటూ భారతభూమి కడుపున పుట్టిన అన్నదమ్ముల లాగనూ, అక్కచెల్లెళ్ళ లాగనూ జీవిస్తున్నారు. ఇదంతా మనకు అనుభవైక్యవేద్యమేకదా!
8. చెన్నపట్నం గవర్నరు దుర్గతి
ఇంగ్లీషువా రీ దేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చేటప్పటికి విజయనగర సామ్రాజ్యం విచ్చిన్నం అయినా చెన్నపట్నం సముద్రతీర ప్రాంతాలన్నీ ఆ చక్రవర్తుల వంశీకులైన చంద్రగిరిరాజుల పరిపాలనలోనే వుండేది. ఆరాజుగారి కింది అధికారిని ఆశ్రయించి ఇంగ్లీషు వారు 1689 లో పట్టాపొంది చెన్నపట్టణం దగ్గిర కోట కట్టుకుని అక్కడ వర్తకం చేసుకుంటూవుండగా దేశమంతా గోలకొండ నవాబుల వశమైంది. తరువాత 1687 లో మొగలాయి చక్రవర్తియైన ఔరంగజేబు గోలకొండను జయించగా యీ ప్రాంతాలన్నీ ఆయన తాబేదారుడైన కర్నాటకనవాబు పరిపాలనకిందకి వచ్చినవి. ఇంగ్లీషు వారు ఏయెండకు ఆగొడుగు పట్టుతూ మొదట చంద్రగిరి రాజులను, తరువాత గోలకొండ నవాబులనూ అటుతరువాత కర్నాటక నవాబునూ ఆశ్రయిస్తూ కాలక్షేపం చేసేవారు.
ఆ ర్కా టు న వా బు
ఇలాగ ఉండగా దేశంలొ అంత:కలహాలు కలిగి ఇంగ్లీషువారు బలవంతులై మనరాజులను, నవాబులను బంతులాడించినట్లు ఆడించి రాజ్యాధికారాలను చేజిక్కించుకోవడానికి అవకాశాలు కలిగినవి. కర్నాటక నవాబు అన్వరుద్దీను 1749 లో చనిపోగా అతని కుమారుడైన మహమ్మదాలీ నవాబు అయినాడు. పూర్వపు నవాబుగారి అన్నకుమారుడి అల్లుడైన చందాసాహేబు ఈకర్నాటక రాజ్యసింహాసనాన్ని