90
కథలు - గాథలు
దగ్గర సంబంధంగల ఆచారాలనూ, ఉత్సవాలనూ, వీరుల గోరీలదగ్గిర మొక్కులనూ వీరు అంగీకరింపక అట్టి ఆచారాలను అవలంబించే ముసల్మానులను "ముష్రకులు" - అనగా భగవంతునితో ఇంకొక వ్యక్తిని కలిపేవారని వ్యవహరిస్తున్నారు. పొగచుట్ట తాగడమును, తావళము తిప్పడమును కూడా వీరుసహించరు."
పూర్వకాలం కంటె తరవాత కాలంనాటి మహమ్మదీయమతము హిందూమతా చారాలపట్ల చాలా సహనం చూపిస్తూవచ్చిందని పైన చెప్పిన డబ్లియు. క్రూకు గారు, పశ్చిమోత్తర పరగణాలను గూర్చి 1897 లో ప్రకటించిన గ్రంధంలోనే వ్రాసినారు.
ముసల్మానులూ, హిందువులూ కలిసి వీరులను ఆరాధించే పద్దతులూ, వారి గౌరవార్థము చేసే ఉత్సవాలూ, పీరుల గోరీలదగ్గిరకి తీర్ధయాత్రలు చేసేటప్పుడు అవలంబించే పద్ధతులూ, వర్ణించాలంటే ఒక పెద్దగ్రంధం అవుతుంది.
ఆం ధ్ర ము స ల్మా ను లు
మన తెలుగు దేశంలో మహమ్మదీయుల ఇళ్ళలో చెసే జాతికర్మలు, వివాహాదిశుభకార్యాలలోను, పండుగలు పబ్బాలలోను అవలంబించే ఆచారాలు మన ఆచారాలకు చాలా సన్నిహితంగా వుండడం అందరికీ తెలుసును. పెళ్ళిళ్ళలో పెళ్ళికూతురుకు పసుపు నలుగు పెట్టడం దగ్గిర నుంచీ పెళ్ళికుమారుడిని మల్లెపువ్వుల జాలరుతొ గుర్రం మీద కత్తితో ఊరేగించడం వరకూ మన క్షత్రియకులాచారాలే ముసల్మానులలోకూడా కనబడుతున్నది. మహమ్మదీయులలో చచ్చిపోయినప్పుడు చేసే అపకర్మలు కూడా చాలావరకూ హిందువులు చేసే టటువంటివే వున్నవి. వారి "ఫాతెహాఁ" మన స్వర్గపాధేయమునకు చాలా సన్నిహితంగా వుంది. ఆఖరికి ఒకవిధమైన తద్దినాలుకూడా వాళ్ళు పెడుతున్నారు. ఇంక మంచిరోజు లనీ, వర్జమనీ, వారమనీ వాళ్ళలోకూడా చాలా పట్టింపులు వున్నవి. ఎన్నికబుర్లు చెప్పినా పక్క ఇంటి హిందువు పాటించే శకునాలను ఇరుగుపొరుగుకీ మహమ్మదీయుడు