మన ముసల్మానులు భారతీయులు కారా?
89
స్థానచరిత్రలోనుంచీ, ఇంకనూ ఇతర ముసల్మానుగ్రంధకర్తల ఉద్గ్రంథాలలోనుంచీ ఈ టాసీగారు తాను వ్రాసిన సంగతులన్నీ గ్రహించినందువల్ల ఈ విషయంలో ఇది చాలా ప్రమాణగ్రంధంగా వుంది. ఇలాగే మా.గస్టవు లీ బాన్ అనే ఇంకొక ఫ్రెంచిగ్రంధకర్త కూడా 'భారతదేశమునందలి నాగరికతలు ' అనే గ్రంధంలో హిందూ దేశంలో మహమ్మదీయ మతాచారాలు పొందిన మార్పులను గురించి చక్కగా వివరించి యున్నారు.
విదేశీయులే గాక భారతీయులు కూడా - అందులో సుప్రసిద్ధ విద్వాంసులైన మహమ్మదీయ ప్రముఖులు కూడా ఈ విషయాన్ని గురించివ్రాసియున్నారు. యూసఫ్ ఆలీ ఎం.ఏ., ఎల్, బి.,ఐ.సి.ఎస్. గారు 'భా రతదేశ ప్రజల జీవనము, వృత్తులు ' అనే గ్రంధంలో ఈ విషయాన్ని బాగా చర్చించి హిందువులు తమ పితృ దేవతలకు పిండములు పెట్టుతూవుంటే హిందూదేశంలోని మహమ్మదీయులు 'షిర్నీ ' యనే ఆచారాన్ని అవలంబించి యున్నారనిన్నీ, గ్రామాలలోని జులహా తేలీ మహమ్మదీయులు హిందువులలాగనే మశూఛికాలు రాకుండా గ్రామదేవతలకు మొక్కుతున్నారనిన్నీ, హిందువులు కాశీ రామేశ్వరాలకు పోయినట్లే మహమ్మదీయులు ఘాజీమియాన్ గోరీ దగ్గరికి యాత్రకు పోతునారనిన్నీ, పాంచన్ పీరులనుగురించి పాటలు పాడతారనిన్నీ, 1910 లో వ్రాసియున్నారు.
డబ్లియు క్రూక్ (Crooke) అనే ఐ.సి.యస్. ఉద్యోగి The North Western Provinces of India అనే గ్రంధములో ఇలాగ వ్రాశారు.
"ఎట్టి కళంకముగాని, కల్మషముగాని, అనాచారములు గాని, మూఢ విశ్వాసములుగాని లేక ఖురాను షరీఫులో సూత్రప్రాయంగా నిర్వచింపబడిన ఇస్లాము సిద్ధాంతాలను అవలంబించే మహమ్మదీయులు ఈ భారతదేశంలో బహు కొద్దిమంది మాత్రమే వున్నారు. ఇలాంటి కఠిననియమాల మతాన్ని అనుష్థించే వారిలో వాహాబీలు, లేక అహల్-ల్-హాదీ లనువారు మాత్రమే యున్నారు. విగ్రహరాధనకు