పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/95

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


లంబించారు. అరబ్బీదేశంలోని ఇస్లాములో ఎట్టి సాకారదేవతార్చనముగాని, మేళతాళములు నృత్యగీత వాద్యములుగాని లేక ఆనంద రహితమైన మానసికారాధన ప్రార్ధనలు మాత్రమే వుండేవి. మనదేశానికి వచ్చిన మహమ్మదీయులు చిరకాలమునుంచి హిందూసంప్రదాయాలకు అలవాటుపడి తాము జీవించే దేశంలోని ప్రకృతిదృశాలకూ, జంతువులకూ, భూసారముపైన ఆదారపడే పాడిపంతలకూ సంబంధించి, ఇంద్రియములకూ మనోభావములకూ రుచించే ఆచార వ్యవహారాలములు, కర్మకాండలకు అలవాటుపడిన ప్రజలకు ఈ ఆనందరహితమైన వీరమహమ్మదీయ మతాచార ధర్మములు రుచించలేదు. అందువల్ల మన ముసల్మానులు తమ మబోభావాలకు వాంచలకు అనుగుణములైన పండుగలు పర్వములు, ఉత్సవములు ఊరేగింపులు, అర్చనలు, ఆరాధనలూ కల్పించు కొన్నారు. హిందువుల గంగాపూజలకు బదులుగా మహమ్మదీయులు భాడ్ నే (భాద్రపద) మాసమున 'క్వజాఖజిర్ ' పండుగను చేయడ ప్రారంభించారు. పూర్వకాలంనాటి మహమ్మదీయ మతయుద్దానికి సంబంధించిన మొహరంపర్వదినములందు మహమ్మదీయులు చేయు ప్రార్ధనాఅదికములూ, ఉత్సవ్చములూ బారతదేశమందు నూతనరూపం దాల్చినవి. దానిని హిందువుల పండుగలాగ మార్చి, హిందువులు అవలంబించే అనేక ఆచారాలూ, కర్మకాండలూ మన ముసల్మానులు ఈ మొహరంలో అవలం బిస్తున్నారు.

ప్రా చ్య పా శ్చా త్య గ్రం ధ క ర్త ల సా క్ష్య ము

   ప్యారిసి లో ప్రాచ్యదేశ భాషల పండితుడుగా నుండిన మా.గార్సిన్ డీ టాసీ (M. Garcin de Tassy) గారు బారతదేశమునందలి హిందూస్థానీ పారశీక సాహిత్యము తరచి హిందూదేశములో మహమ్మదీయ మతము పొందిన మార్పులను గురించి 1831 లో ఒక గొప్పవ్యాసాన్ని వ్రాసి ప్రకటించారు.  కాజీం ఆలీ జవాన్ సాహేబు గారు హిందూస్థానీలో "బారామాష్" (పన్నెండు నెలలు) అనే గ్రంధంలోనుంచీ షెర ఆఫ్ గన్ సాహేబుగారు రచించిన హిందూ