మన ముసల్మానులు భారతీయులు కారా?
దీయ మహాత్ముల పవిత్రస్థలములలో జరిగే మొక్కుబడులలోనూ, పూజలలోనూ, ఉత్సవాలలోనూ, సంతలలోనూ, బాగా కనబడుతూ ఉంది. ఈ పీరుల యారాధనము హిందూదేశపు సరిహద్దులు దాటిన తరువాత యింక యే మహమ్మదీయ రాజ్యంలోనూ లేదు. ఇది హిందువులలో పూర్వం బౌద్ధ బోధిసత్వులకూ, జైనతీర్ధులకూ, వైష్ణవఆళ్వరులకూ, జైనభక్తులకూ జరిగే ఆరాధనలు, అర్చనలు, మహోత్సవములు వంటివే.
హిందువులు ముప్పైమూడుకోట్ల దేవతలను ఆరాధిస్తూ వారికి మొక్కుకుంటూ ఉన్నట్లే మహమ్మదీయులైన హిందువులకు కూడా ఒక విధమైన ఆరాధనలు, అర్చకులు, మొక్కుబళ్లు, ఉత్సావాలూ అవసరమైన ఈ పీరుల ఆరాధన బయలుదేరింది. ఈ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు పీరులకు మొక్కు కోవడమూ, సామాన్యజనులు తమ యిష్టసిద్ధులు చేయవలసిందని పీరులకు మొక్కుకోవడమూకూడా ప్రబలింది. హిందువుల దేవతలలాగనే మహమ్మదీయుల పీరులుకూడా మంచి చెడుగులను కారణభూతము లైనట్లే ప్రజలు విశ్వసించి అందుకనుగుణముగా వారి నర్చించడం ప్రారంభమైనది. దీనితోపాటు వ్యాజ్యములు గెల్పించమని మొక్కులు, ప్రయాణంలో కార్యసాఫల్యం చేయమని మొక్కులు, తాయత్తులు, శకునములు, దీవనలు మొదలైన హిందూ ఆచారాలన్నిఈ మహమ్మదీయులలోకూడా ప్రబలమైనవి. ఇలాంటి పీరులను కొలిచే మహమ్మదీయజనసామాన్యము, తొడి హిందువులను చూసి గ్రామదేవతలకు మొక్కుకొవడమూ, గొట్టాలమ్మా, మహమ్మారీ మొదలైన క్షుద్ర దేవతలను కొలిచే బీద హిందువులు మహమ్మదీయ సోదరుల పీరులకు మొక్కుకోవడమూ, ఫకీరుల దీవనలూ, పైగంబరుల ఆశీర్వాదములూ పొందడమూ ఒక వింత సంగతి కాదు.
పండుగలు - పర్వములు
భారత దేశమున మహమ్మదీయులు తమ మతానికి సంబంధించిన ఉత్సవాలు జరపడంలోకూడా అనేక హిందూసంప్రదాయాలను అవ