Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

కథలు - గాథలు

రాజ్యాలైన రాజపుత్ర స్థానంలోని సంస్థానాలలో రాళ్లను చెక్కే శిల్పులందరూ మహమ్మదీయులే.

మ త ము

మతవిషయంలో కూడా హిందూమహమ్మదీయ సమ్మేళనకు నిదర్శనాలు కనబడుతున్నవి. హిందూదేశంలో జన్మించిన వాళ్లందరికీ సాకారేశ్వరా రాధనమున్నూ, కర్మకాండయున్నూ సామాన్యధర్మములుగా నుంటున్నవి. హిందూదేశంలోని మహమ్మదీయులలో చాలామంది హిందువులుగా నుండినవాళ్లే. ఇంతేగాక ఈ దేశంలోకి మహమ్మదీయమతం సూటిగా అరబ్బీదేశంలోనుంచిగాక మధ్యమజిలీయైన పారశీక దేశంలోనుంఛి వచ్చినందువల్ల పారశీకదేశంలోని కొంతమార్పుచెంది యిక్కడికి వచ్చినది. ఇలాగ కొంతమార్పుచెందివచ్చిన యీ మహమ్మదీయమతము ఈ దేశంలోని హిందువుల వైదికమతధర్మాలతో ఏడుశతాబ్దాలు సహవాసం చేసింది. అందువల్ల యీ మహమ్మదీయమతము ఆచారాలలోను, కర్మకాండలోను ఇక్కడ చిత్రవిచిత్రాలైన మార్పులను జెంది ఇతర దేశాలలో నున్న ఇస్లాము మతధర్మాలకు చాలా విషయాలలో భిన్నంగా పరిణమించియున్నది. ఈపరివర్తన మెంతవరకూ జరిగిన దనగా ఉత్తర హిందూస్థానములోని జనసామాన్యము ఈ ప్రకరంగా మార్పుచెందిన ఇస్లాము మతము యొక్క ఆరాధనలనందున్నూ, ఉత్సవములందున్నూ, పండుగులలోనూ పాల్గొనడానికి గాని, మహమ్మదీయల పవిత్రస్థలాలకు తీర్దయాత్రలకు పోవడానికిగాని హిందువులకు ఎలాంటి సంకోచమూలేకుండా హిందువులందరూ అలా చేస్తున్నారు. హిందువుల లాగనే మహమ్మదీయులలొ సామాన్యజనులుకూడా పాల్గొంటూ వారి యాత్రాస్థలాలకు పోతున్నారు.

పీ ర్లు - మొ క్కు బ డు లు

హిందూ మతధర్మాల సాహచర్యంవల్ల మార్పుచెందిన ఇస్లామును గురించి ప్రాచ్యపాశ్చాత్య గ్రంధకర్తలనేకులు పరిశోధనలు చేసి వాసియున్నారు. ఈమార్పు ముఖ్యముగా పీరు లనబడు మహమ్మ