మన ముసల్మానులు భారతీయులు కారా?
85
చూడగా నొకరి ఆచారవ్యవహారాల నొక రెంతచక్కగా గ్రహించి అందు కనుగుణ్యముగా కావలసిన వస్తుసామగ్రి నెంత శ్రద్దతో తయారు చేయగలరో తెలుస్తుంది.
ఇలాగే పూజలలో ఉపయోగిందే శ్రీయంత్రమును స్ఫటికముపయిన చెక్కే శిల్పులు మహమ్మదీయు పనివాళ్ళే, మంత్రశాస్త్రమునకు సంబంధించిన యంత్ర తంత్రములలో ఒక్క బీజాక్షరము గాని, భుజముగాని తప్పురాకుండా చెక్కవలెనంటే ఎంత శ్రద్ధాశక్తులతో ఆపని చెయ్యాలో ఊహింపవచ్చును.
హిందూ మహమ్మదీయులు ఇళ్లలో నుపయోగించే హుక్కాలు, పాన్ దానులు, అత్తరుదానులు, తివాచీలు, ఇంకను గొప్పవాళ్లు వుపయోగించే వివిధములైన వస్తువులూ, హిందూ మహమ్మదీయ పారిశ్రామికులు ఎలాటి మతభేదమూ లేకుండా తయారు చేస్తారు. ఇత్తడి సామానుల మీదా, రాగిసామానులమీదా, లక్కతో నగిషీపనిచేసే కులవృత్తిమహమ్మదీయులది. అయితే జయపురంలో హిందూ పారిశ్రామికులీ పనిని నేర్చుకొనిఈ వస్తువులను తయారుచేయడం ప్రారంభించి ఈసామానులమీద హిందువుల పురాణకధలను గూర్చిన చిత్రములూ, మత సంబంధమైన ఇతరనమోనాలు, బొమ్మలు చెక్కేవారు. ఇది చూసి ఈ జయపుర హిందూపారిశ్రామికుల లాగనే మహమ్మదీయ పారిశ్రామికులు కూడా ఈ బొమ్మలను, నమోనాలను వెయ్యడం ప్రారంభించారు. లుంగీలూ, పగ్రీలనే తలపాగాలూ చేసే వృత్తిలో హిందువులూ, మహమ్మదీయులూ కూడా నున్నారు. అనేక గృహపరిశ్రమలలలో ఒక వస్తువును కొంతవరకూ ఒకజాతి పనివాడూ, తక్కిన భాగమును రెండవజాతి పనివాడూ చేయడము కూడా కద్దు. కీన్కాబు , జరీ,పట్టు, బుటేదారీ పరిశ్రమలో మతలబును తయారుచేసే పనివాళ్లందరూ హిందువులే. కీన్కాబు కార్ఖానాలన్నీ హిందువులవే. కాశీలో కీన్కాబు నమోనాలు తయారు చేసేవారందరూ మహమ్మదీయులు. నేతగాళ్లలో హిందువులూ, మహమ్మదీయులు కూడా వున్నారు. వీటిని విక్రయించే వర్తకులందరూ హిందువులే. హిందూ