84
కథలు - గాథలు
గ్రంథాలను రచించిన ముసల్మాను వైష్ణవకవుల పేర్లు 24 దాకా బయటపడినవి. ఈ కవులలో సయ్యద్ మర్తుజాగరి వైష్ణవగీతము లతిరమణీయంగా నున్నవని తెలిసినవారంటున్నారు.
ఇలాగ ఈ ప్రాంతాలలొ హిందువులకూ మహమ్మదీయులకూ కూడా బంగాళీభాష మాతృభాషగా నుండడమేగాక ఉభయులకూ భారతీయ సాహిత్య సంప్రదాయములే ప్రీతికరంగా నుంటున్నవని స్పష్టంగా కనబడుతూవుంది.
పంజాబులోను, అయోధ్య ఆగ్రారాష్ట్రాలలోనూ చాలాకాలం నుంచి ఉర్దూభాషా, పారశీకభాషా విద్యాధికుల యాదరణకు పాత్రములై ఉంటున్నవి. వీరికి భారతీయసాహిత్య సంప్రదాయాల కంటే పారశీకసాహిత్య సంప్రదాయాలే ఎక్కువ ఆదరణ పాత్రంగ నుంటూ వున్నవి. అందువల్ల యీ ప్రాంతాలలో సామాన్యజనులలో మహమ్మదీయులలాగనే హిందువులలోకూడా హైందవపురాణ కధలకన్నా, భారతీయసాహిత్య విషయాలకన్నా "యూసఫ్ - జులేఖా", "షిరీన్ - ఫరీద్", "గులేబకావలి", "లైలామజ్నూన్" మొదలైన పారశీక కావ్యకధలే ఎక్కువ బాగాతెలుసును. ఇటీవల కొంతకాలం క్రిందట ఆప్రాంతాల హిందువులు తమ మతానికీ, పూర్వ నాగరికతకూ, విజ్ఞానానికీ సంబంధించిన సాహిత్యంకూడా బాగా తెలుసుకోవడం అవసరమనే ప్రచారంకూడా చేయవలసి వచ్చింది.
వా ణి జ్య ము - ప రి శ్ర మ లు
ప్రజల వేషభాషలలో లాగనే వాణిజ్యవ్యాపారములలోను, పరిశ్రమలలోను, వృత్తులలోనూ కూడా హిందూమహమ్మదీయ సమ్మేళనము కనబడుతూ వుంది. హిందువులు అతిపవిత్రంగా నెంచి అన్ని శుభకార్యాలలోనూ మడిబట్టగా ధరించే కాశీపట్టు తాపితాలు నేసేవాళ్లు మహమ్మదీయ నేతగాళ్లే! ఈ తాపితాలను అందులోను నేతలొనే కనబడే పట్టుజలతారు డోరియాలు, పువ్వులు, చిత్రములు కేవలమూ హిందువుల యాచారమునకు సంబంధించిన నమోనాలే. దీనిని మహమ్మదీయులు నేయడమూ, హిందువులు ధరించడమూ