మన ముసల్మానులు భారతీయులు కారా?
83
త్యము సంపాదించిన మహమ్మదీయులు కూడా చాలామంది వున్నారు. తరువాత కొంతకాలానికి తులసీదాసు సుప్రసిద్ధమైన తన రామాయణాన్ని రచించిన అవధి-హిందీబాషలలో క్రీ.శ.1540 లోనే మలీకు మహమ్మదు అనే ముసల్మానుకవి 'పద్మావతి ' అనే చక్కని కావ్యాన్ని రచించాడు. ఇందులో భూలోకసుందరియైన పద్మావతి, ఆమెభర్త రతన్ సింగుల ప్రణయగాధ, అల్లావుద్దీన్ చక్రవర్తి చిత్తూరు దుర్గాన్నిముట్టడించగా పురుషులు వీరస్వర్గాన్ని అలంకరించడము, రాజపుత్రస్త్రీలు జోహారుచేయడము మొదలైన అంశాలను ఎంతో రసవంతంగా ఈ ముసల్మానుకవి వర్ణించాడు.
జీవాత్మ, పరమాత్మకోసం వెదుక్కునే అంతరార్ధాన్ని కూడా ఆ కావ్యంలో స్ఫురింపజేయడంవల్ల ఈ కవికి హిందువుల సంగతి ఎంతబాగా తెలుసునో, వారియం దెంత స్నేహభావ మున్నదో కనబడుతూవుంది.
హిందీభాషలో ఉత్తమగ్రంధాలను రచించిన ముసల్మానులలో అక్బరుచక్రవర్తి సభలోని నవరత్నాలలో ఒకడైన అబ్దుల్ రహీముఖానుఖానన్, తాను హిందీలో కవిత్వంచెప్పడమే గాక, హిందీ సాహిత్యానికి పోషకుడుగా కూడా ప్రసిద్ధి కెక్కినాడు. అతడు రాధాకృష్ణ శృంగార గీతముల నెన్నోరచించాడు.
బంగాళీభాషలో కవిత్వం చెప్పిన మహమ్మదీయులు చాలా మంది వున్నారు. మలీకుమహమ్మదుగారి 'పద్మావతి 'ని అల్వాల్ అనే కవి బెంగాళీభాషలోకి చక్కగా అనువదించాడు. వంగరాష్ట్రాన్ని పరిపాలించిన మహమ్మదీయనవాబులు చాలామంది బంగాళీ సాహిత్యాన్ని బాగా ఆదరించారు. చైతన్యస్వామి ప్రచారంచేసిన వైష్ణవమతము కొంతమంది మహమ్మదీయులను ఆకర్షించినది. ఆకాలంలో వైష్ణవమతంలో కలిసిన ముసల్మానులలో హరిదాసు ఒకరు. అలాంటి వారిలో కొంతమంది రాధాకృష్ణులను గురించీ, చైతన్యస్వాములనుగురించీ పదాలూ, పాటలూ రచించారు. దినేకచంద్రసేను, అబ్దుల్ కరీము. వ్రజసుందర సన్యాల్ గార్లు చేసిన కృషివల్ల బంగాళీభాషలో ఈ విధంగా వైష్ణవ