82
కథలు - గాథలు
---అనగా, "నందలాలే తన కడుపున పుట్టాలని తల్లి మనసారా కోరింది. ఆనంద భరితురాలైన ఆ తల్లి నందలాలే తన కడుపున పుట్టాలని కోరింది. మా అబ్బాయి నన్ను బాధలు పెట్టాడు, నీల(మేఘ)శ్యాముడు నన్ను బాధలు పెట్టాడు" అని యీపాట తాత్పర్యము, ఈపాటలో "నంద్ లాల్, శాన్ వాల్యా" అనే మాటలు శ్రీకృష్ణుని ఉద్దేశించినవే నని ఒక మహమ్మదీయ గ్రంధకర్త వ్రాసియున్నాడు. (1910- వసం॥ 'మోడరన్ బీహార్ ' 8 వ పుటలో బ్యారిష్టరు ముజ్రుల్ హక్కుగారి వ్యాసం చూడండి)
ఉత్తర హిందూస్థానంలో పంజాబురాష్ట్రంలో వివిధగ్రామాలలో హిందూ మహమ్మదీయ ప్రజలు పాడేపాటలలోని కధలలోకూడా తేడాలు లేవు. ఇలాగ హిందువులు మహమ్మదీయ కధలనూ, మహమ్మదీయులు హిందువుల కధలనూ, పాటలుగానూ, కలాపములుగానూ, వీధినాటకములుగానూ, పాడుకొంటున్నారు.
భాష - సాహిత్యము
వంగరాష్ట్రంలో మహమ్మదీయు లందరూ బంగాళీభాషనే మాట్లాడుతారు. ఇలాగే పంజాబులోని పంజాబీని, సింధులో సింధీ భాషనూ, ఇతర ప్రాంతాలలో ఆయారాష్ట్ర భాషలనూ, మాట్లాడుతారు. ఉత్తర హిందూస్థానంలో విద్యావంతులైన హిందువులూ, మహమ్మదీయులూకూడా మాట్లాడేటప్పుడుగాని, పద్యగద్య రూపంగా గ్రంధాలు వ్రాసేటప్పుడుగాని, ఉర్దూభాషనే వాడతారు. ఈ ఉర్దూ భాష వ్యాకరణము మన దేశభాషల సంప్రదాయానికి చెందినదే. అందులోని శబ్దాలు మాత్రం ఎక్కువగా ఫారసీ భాషలోనివి. ఈ ఉర్దూభాషలో ఉత్తమ గ్రంధాలు రచించిన వారిలో హిందువులూ, మహమ్మదీయులూ కూడా సమానంగా వున్నారు. హిందువులలో ఉర్దూభాషలో సుప్రసిధ్దమైన కవి దయాశంకర్ నశీం, వచనంలో పేరొందిన గ్రంధకర్త పండిత రతన్ నాధ్.
ఇంతేకాదు, పారశీకభాషలో నుంచి మన దేశభాషలలోనికికూడా చక్కని పదాలు చాలా వచ్చి కలిసినవి. మన దేశభాషలలో పాండి