మన ముసల్మానులు భారతీయులు కారా?
77
లైనవారు హిందువులలాగనే ప్రత్యేక కులాచారాలనే అవలంబించి యున్నారు.
హిందూముసల్మానుల 'భారతీయ ' సభ్యత
భారతదేశంలో హిందూముసల్మానుల చిరకాల సాహచర్యం వల్ల ఈ యుభయుల వేషభాషలూ, అచారాలూ విడదీయ లేనంతటి విధంగా కలిసిపోయి కేవలమూ మహమ్మదీయుల దనిగాని, హిందువుల దనిగాని చెప్పడానికి వీలులెని విధమైన 'భారతీయ ' సభ్యత యొకటి యేర్పడి యున్నది. ఈ చిరకాల సాహచర్యమువల్ల ఉభయులు వేషభాషలలో, మతాచార వ్యవహారాలలో, సంగీత సాహిత్యములలో, శిల్పములో, రుచులలో, తుదకు స్వభావములలో కూడా మార్పులు కలిగినవి. దీనిని గుఱించి హిందువులు, మహమ్మదీయులు, విదేశీయులు పాశ్వాత్యులు కూడా అనేక గ్రంధాలలో వ్రాసియున్నారు. ఇలాంటి రచన లన్నియు సేకరించి శ్రీ రవీంద్రనారాయణఘోష్ గారు 1911 వ సంవత్సరంలో కలకత్తానుంచి ప్రకటింపబడే 'డాన్ సొసైటీవారి మాసపత్రికలో అయిదు గొప్పవ్యాసాలను వ్రాశారు.
'హిందీ ' ల నే ము స ల్మా ను లు
అనేకభాషలయం దపారమైన పాండిత్యము సంపాదించి అరబ్బీ నాగరికతను గుఱించి ఫ్రెంచిభాషలో లెబా న్ గారు వ్రాసిన గ్రంధాన్ని ఉర్దూభాష లోనికి అనువదించి, చెన్నపురి విశ్వవిద్యాలయంలో సంస్కృతపరీక్షకుడుగా కూడా పనిచేసి, 1911 లో దివంతగులైన సయ్యద్ ఆలీ బిల్ గ్రామీగారు శికందరాబాదులో ఉపన్యసిస్తూ ఇలాగ చెప్పారు:-
"హిందూదేశపు ముసల్మానులమైన మనము తురుష్కదేశ మందున్న, ఇతర మహమ్మదీయ రాజ్యాలయందున్నూగల ముసల్మానులందరూ మనలను ముసల్మాను లనక 'హిందీ ' లని వ్యవహరించేటంతగా భారతీయ సభ్యతలో లీనమైనాము. ఈ 'హిందీ ' అనే శబ్దము వినడానికి 'హిందూ ' అనే శబ్దానికి భిన్నంగ అ కనబడుతూ వున్నా దీని అర్ధం